National award winner Icon Star Allu Arjun was invited to Nandamuri Balakrishna's Golden Jubilee celebrations

 నేషనల్ అవార్డు గ్రహీత ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ గారిని నందమూరి బాలకృష్ణ గారి స్వర్ణోత్సవ వేడుకలకు  ఆహ్వానం అందించడం జరిగింది



నందమూరి బాలకృష్ణ గారు సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న  హైదరాబాద్ హైటెక్స్  నోవోటెల్ హోటల్లో  తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. నేషనల్ అవార్డు గ్రహీత ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ గారిని కలిసి తెలుగు సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించిన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారు, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు, తెలంగాణ స్టేట్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ అనుపమ రెడ్డి గారు, మా అసోసియేషన్ నుండి మాదాల రవి గారు, శివ బాలాజీ గారు, నిర్మాత ముత్యాల రామదాసు గారు.


ఈ సందర్భంగా ఆహ్వానించడానికి వచ్చిన సినీ పెద్దలతో అల్లు అర్జున్ గారు సానుకూలంగా స్పందిస్తూ బాలకృష్ణ గారి గురించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకోవడం జరిగింది. 


Post a Comment

Previous Post Next Post