పాటలతో దూసుకెళ్తున్న లవ్లీ లావణ్య
2019లో మిస్ సూపర్ మోడల్ ఆఫ్ కర్ణాటకగా ఎంపికైన లవ్లీ లావణ్య తెలుగులో పలు పాటల ద్వారా దూసుకెళ్తున్నారు. బిగ్ బాస్ ఫేం ప్రిన్స్ యావర్‌తో కలిసి లావణ్య నటించిన ‘నీ చూపులతో’ సాంగ్ ప్రోమో గురువారం విడుదలై ఆకట్టుకుంటోంది.
మాతృ భాష కన్నడతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన లావణ్య.. నటనలోనూ నైపుణ్యాన్ని అందిపుచ్చుకున్నారు. తన అందంతో, నటనతో ఇప్పటికే ఎన్నో పాటల్లో ఆడిపాడిన లావణ్య తెలుగులోనూ తన సత్తా చాటుతోంది. యావర్‌తో కలిసి లావణ్య నటించిన ‘నీ చూపులతో’ ఫుల్ సాంగ్ నేడు విడుదల కానుంది.
పాటల్లో తన అందచందాలతో మెప్పిస్తున్న లావణ్య.. తెలుగులో సినిమాల్లో నటించడమే తన లక్ష్యంగా పెట్టుకుంది. నటనకు అవకాశం ఉన్న మంచి పాత్రలు వస్తే తానేంటో నిరూపించుకుంటానని చెబుతోంది.
లావణ్య 2001 డిసెంబర్ 8న బెంగళూరులో జన్మించింది. 2019లో మిస్ సూపర్ మోడల్ ఆఫ్ కర్ణాటకగా ఎంపికవడంతో పాటు మైసూర్ మిస్ లీడింగ్ లైట్‌గానూ గెలుపొందారు. టీ-సిరీస్ యూట్యూబ్ చానల్‌లో ‘నీలి నింగి కళ్లు’ పాటతో పాటు చాలా పాటల్లో నటించింది. అలాగే ఎన్నో యాడ్ షూట్స్‌లోనూ లావణ్య కనిపించారు.
Post a Comment