Ammiraju Kaanumilli Elected As General Secretary for Telugu film Industry Employees Federation

 తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి గా అమ్మిరాజు కానుమల్లి విజయం



తెలుగు ఫిలిమ్ లోని 24 క్రాఫ్టుకు చెందిన ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి గా అమ్మిరాజు కానుమల్లి విజయం సాధించారు. నేడు, ఆదివారంనాడు జరిగిన కార్యదర్శి ఎన్నికల్లో అమ్మిరాజు 35 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇంతకుముందు ఈ పోస్ట్ లో దొరై ఉండేవారు. ఇటీవలే జరిగిన మేనేజర్ స్ ఎన్నికల్లో దొరై ఓడిపోయారు. నిబంధనల ప్రకారం ఆయన ఫెడరేషన్ పోస్ట్ కు అనర్హుడు కావడంతో ఈ పోస్ట్ కు ఎన్నిక అనివార్యం అయింది.

కాగా, ఫెడరేషన్ కార్యదర్శిగా వెళ్లంకి శ్రీనివాస్, వెంకట్ కృష్ణ కూడా పోటీచేయగా అమ్మిరాజు గారు 35 ఓట్ల ఆధిక్యత తో గెలుపొందారు.

దీనితో, ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా అనిల్ వల్లభనేని, కార్యదర్శిగా అమ్మిరాజు, కోశాధికారిగా సురేష్ ఉన్నారు.

ఈ సందర్భంగా ప్రెసిడెంట్ అనిల్ మాట్లాడుతూ, 24 శాఖలకు చెందిన ఫెడరేషన్ లో కార్యదర్శి ఎన్నిక అనివార్యం అయింది. అమ్మిరాజు గారు కార్య దర్శి గా ఎన్నిక కావడం ఆనందంగా ఉంది. ఇండస్ట్రీ కి 24 క్రాఫ్ట్ కీలకం. కార్మికులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని అన్నారు. తనను కార్యదర్శి గా ఎన్నుకున్న సభ్యులకు అమ్మిరాజు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల పక్షాన సమస్యలకు అండగా ఉంటానని తెలిపారు.

Post a Comment

Previous Post Next Post