Young Actor Santosh Soban Uv Creations Announces Next Film "Couple Friendly"

 యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తున్న "కపుల్ ఫ్రెండ్లీ" సినిమా నుంచి హీరో సంతోష్ శోభన్ బర్త్ డే గ్లింప్స్, టైటిల్ లుక్ రిలీజ్




ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో సంతోష్ శోభన్ హీరోగా యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తున్న మూవీ "కపుల్ ఫ్రెండ్లీ". ఈ రోజు హీరో సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెస్ తెలియజేస్తూ స్పెషల్ గ్లింప్స్ తో పాటు ఈ సినిమా టైటిల్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. "కపుల్ ఫ్రెండ్లీ" చిత్రంలో మిస్ ఇండియా మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది.


లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ కుమార్.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. "కపుల్ ఫ్రెండ్లీ" టైటిల్ లుక్ లో చెన్నై సెంట్రల్ స్టేషన్ దగ్గరలోని ఓ రెసిడెన్షియల్ ఏరియాను చూపించారు. చెన్నై బ్యాక్ డ్రాప్ లో సాగే ఇంట్రెస్టింగ్ మూవీగా "కపుల్ ఫ్రెండ్లీ" ఉండబోతోంది.


నటీనటులు - సంతోష్ శోభన్, మానస వారణాసి, తదితరులు


టెక్నికల్ టీమ్

ఆర్ట్ డైరెక్టర్ - మైఖేల్

ఎడిటర్ - గణేష్ శివ

సినిమాటోగ్రఫీ - దినేష్ పురుషోత్తమన్

మ్యూజిక్ - ఆదిత్య రవీంద్రన్

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

కో ప్రొడ్యూసర్ - అజయ్ కుమార్.పి.

సమర్పణ - యూవీ క్రియేషన్స్

నిర్మాణం - యూవీ కాన్సెప్ట్స్

రచన దర్శకత్వం - అశ్విన్ చంద్రశేఖర్




Post a Comment

Previous Post Next Post