Home » » Ustaad Ram Pothineni Wraps Up Dubbing In Style For Double ISMART

Ustaad Ram Pothineni Wraps Up Dubbing In Style For Double ISMART

 'డబుల్ ఇస్మార్ట్' డబ్బింగ్‌ కంప్లీట్ చేసిన ఉస్తాద్ రామ్ పోతినేని



హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్' లో ఉస్తాద్ రామ్ పోతినేని, సంజయ్ దత్‌ల డైనమిక్ క్లాష్‌ ను పవర్ ఫుల్ గా ప్రెజెంట్స్ చేస్తున్నారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. ఆగస్టు 15న ఈ మూవీ విడుదల కానుంది. బ్లాక్‌బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీ డబుల్ ఇంటెన్స్, గ్రాండియర్ గా వుండబోతుంది.


ఈ మూవీకి రామ్ పోతినేని తన డబ్బింగ్‌ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా మేకర్స్ డబ్బింగ్ సెషన్ నుంచి వీడియోను విడుదల చేశారు. కొత్తగా రిలీజ్ చేసిన క్లిప్‌లో, రామ్ తన క్యారెక్టర్  మాస్ అప్పీల్‌ను హైలైట్ చేసే పవర్ ఫుల్, ఇంపాక్ట్ ఫుల్ డైలాగ్‌ను చెప్పారు. 'మామ... మాస్క్ ఉంటె నీకు దొంగోడు మాత్రమే కనపడతడు... మాస్క్ లేకుంటే నీకు మి*డెడు కనపడతడు ...”అంటూ రామ్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.


ఈ డైలాగ్ మూవీలో రామ్ హై-ఆక్టేన్, లార్జర్ దేన్-లైఫ్ క్యారెక్టర్ ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. ఈ పాన్-ఇండియా చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. పాటలు, టీజర్ థంపింగ్ రెస్పాన్స్ తో సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.


పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ కి జోడిగా కావ్య థాపర్ నటిస్తోంది.


ఈ చిత్రానికి సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి సినిమాటోగ్రఫీ అందించారు.


డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇండిపెండెన్స్ డేకి మూవీ విడుదల కానుండడంతో ఎక్సయిట్మెంట్, యాంటిసిపేషన్ మరింతగా పెరుగుతాయి.  


నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను తదితరులు.


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్

నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్

బ్యానర్: పూరి కనెక్ట్స్

వరల్డ్ వైడ్ రిలీజ్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ (నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి)

సీఈఓ: విషు రెడ్డి

సంగీతం: మణి శర్మ

సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి

స్టంట్ డైరెక్టర్: కేచ, రియల్ సతీష్

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా



Share this article :