Social Responsibility Of Telugu Film Industry To Promote Awareness Against Narcotic Drugs And Cybercrimes

 / టి ఎఫ్ సి సి / 2023 - 25   తేదీ : 04-07-2024



ప్రచురణార్ధం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ A. రేవంత్ రెడ్డి గారిని తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రతినిధులు ఇటీవల కలిసినప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన విషయములు పై సానుకూలంగా స్పందించినారు.


03-07-2024 తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సమాజాన్ని పట్టి పీడిస్తున్న  డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణ పై సినీ రంగ ప్రముఖులు, సినిమా థియేటర్ యాజమాన్యాలు తమవంతుగా భాగం పంచుకోవాలని అన్నారు.

లోగడ ఇటువంటి విషయాలలో చలన చిత్ర పరిశ్రమ ముందుండి ప్రభుత్వానికి అండగా ఉందని తెలియచేయుచున్నాము మరియు ఈ విషయం పై చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, పంపిణీదారులు మరియు థియేటర్స్ యాజమాన్యాలు డ్రగ్స్ మరియు సైబర్ నేరాలను అరికట్టడానికి తమవంతు భాధ్యత నిర్వర్తించడానికి ఇకపైన కూడా ఎల్లవేళలా తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉంటుందని తెలియజేయుచున్నాము. దీనిపై అతి త్వరలో గౌరవ ముఖ్యమంత్రిగారిని కలవగలమని తెలియజేయుచున్నాము.


        (వి. వెంకటరమణారెడ్డి (దిల్ రాజు)) (కె. ఎల్. దామోదర్ ప్రసాద్) (కె. శివప్రసాద రావు)  

                     అధ్యక్షులు               కార్యదర్శులు


Post a Comment

Previous Post Next Post