Producer SKN fulfilled his promise, gifted AUTO to Mariamma

మరోసారి తన సేవా గుణం చాటుకున్న నిర్మాత ఎస్ కేఎన్



ఛారిటీ యాక్టివిటీస్ లో ముందుండి మంచి పేరు తెచ్చుకున్నారు యంగ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్. సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చే విషయాలపై స్పందించి సాయం చేస్తుంటారు. తాజాగా ఆయన పిఠాపురంకు చెందిన మరియమ్మ అనే మహిళకు ఆటో కొని బహుమతిగా ఇచ్చారు. ఏపీలో ఎన్నికల సమయంలో పిఠాపురంకు చెందిన మరియమ్మ అనే మహిళ పవన్ కల్యాణ్ గెలిస్తే తన భర్త రిక్షా నడపగా వచ్చిన డబ్బులతో ఊరిలోని వారికి పార్టీ ఇస్తానని ఓ మహిళ సంతోషంగా యూట్యూబ్ ఛానెల్ తో చెప్పింది.


ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఎస్ కేఎన్ దృష్టికి వచ్చాయి. ఆయన స్పందించి ఆమె కోరుకున్నట్లు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పిఠాపురంలో గెలిస్తే మరియమ్మకు తన డబ్బులతో ఆటో కొనిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు పిఠాపురం వెళ్లి మరియమ్మకు ఆటో కొని బహుమతిగా ఇచ్చారు. మరియమ్మకు ఎస్కేఎన్ ఆటో కొనివ్వడం, ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అ‌వుతున్నాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ ఎస్ కేఎన్ సేవాగుణాన్ని ప్రశంసిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post