NBK HELPING HANDS Celebrating Nbk Golden Jubilee

 కనీవినీ ఎరుగని రీతిలో , కన్నులపండుగగా బాలయ్య గారి "50 వసంతాల" స్వర్ణోత్సవ సంబరాలు .. భారీగా ఏర్పాట్లు చేయనున్న నందమూరి అభిమానులు



1974 "తాతమ్మ కల " చిత్రంతో NTR నట వారసుడిగా వెండితెరకి పరిచయమై తన అద్భుత నటనతో అంచెలంచెలుగా ఎదిగి... " తండ్రికి తగ్గ తనయుడు" గా అందరి ప్రశంసలు పొంది , విశ్వవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న లెజెండ్ బాలయ్య గారి సినీ ప్రస్థానం 50 వసంతాలు పూర్తి చేసుకోవడం

అరుదైన గౌరవం , భారతదేశ సినీ చరిత్రలో నట వారసుడిగా 50 యేండ్లు పూర్తి చేసుకున్న ఏకైక అగ్ర కథానాయకుడుగా కొత్త చరిత్ర కు శ్రీకారం చుట్టారు


తన తండ్రి NTR గారి తర్వాత నేటితరంలో పౌరాణిక, సాంఘిక, జానపద, చారిత్రాత్మక చిత్రాలు చేసి.. అన్ని జనరేషన్స్ ప్రేక్షకులను మెప్పించిన ఒకేఒక్కడు బాలయ్య కావడం మన తెలుగువారందరికి గర్వకారణం.

ఈ ప్రతిష్టాత్మక 50 వసంతాల బాలయ్య సినీ స్వర్ణోత్సవ సంబరాలను NBK HELPING HANDS అధ్యక్షులు అనంతపురం జగన్ బాలయ్య అభిమానులను ఒక టీమ్ గా ఏర్పాటుచేసి అత్యంత వైభవంగా 50 రోజుల పాటు పెద్దఎత్తున నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారు , అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా హైదరాబాద్ లో ఘనంగా వేడుకలు చేయడానికి సిద్ధం చేస్తున్నారు 


గతంలో NBK HELPING HANDS ఆధ్వర్యంలో బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి కోసం 70 రోజుల పాటు భారతదేశ శతపుణ్యక్షేత్ర జైత్రయాత్ర ని చేపట్టి ఒక చరిత్రను సృష్టించారు.. అంతేకాకుండా బాలయ్య 60వ పుట్టినరోజు వేడుకలను విశ్వవ్యాప్తంగా ఉండే బాలయ్య అభిమాన సోదరులందరు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఒకే సమయంలో తొంభై వేల మందికి పైగా కేక్ కట్ చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పి బాలయ్య అభిమానుల సత్తాని చాటారు..


ఇప్పుడు .. మరోసారి మేము ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మా బాలయ్య కోసం అభిమానులందరు కలిసి అతిపెద్ద పండుగ చేయబోతున్నాం... అభిమానులందరి తరుపున ఈ వేడుకను నిర్వహించడానికి అవకాశం కల్పించిన బాలయ్య గారికి కృతజ్ఞతలు తెలుపుతూ..

Post a Comment

Previous Post Next Post