Nabha Natesh Receiving Appreciation from Audience for Performance in Darling

 "డార్లింగ్"లో తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న నభా నటేష్



హీరోయిన్ నభా నటేష్ మంచి పర్ ఫార్మర్ అనే పేరు అటు ప్రేక్షకుల్లో ఇటు చిత్ర పరిశ్రమలో ఉంది. తన రీసెంట్ మూవీ "డార్లింగ్" తో ఈ గుర్తింపును మరింతగా పెంచుకుంది నభా నటేష్. ఈ సినిమాలో స్ప్లిట్ పర్సనాలటీ క్యారెక్టర్ లో నభా నటేష్ నటన అందరినీ ఆకట్టుకుంటోంది. ఐదారు వేరియేషన్స్ లో నటించి ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేస్తోంది నభా. ఆమె పాత్రకు ప్రేక్షకులు థియేటర్స్ లో బాగా కనెక్ట్ అవుతున్నారు. కెరీర్ స్టార్టింగ్ లోనే నభాకు ఇలాంటి మంచి క్యారెక్టర్ దొరకడం ఆ క్యారెక్టర్ లో ఆమె మెప్పించేలా పర్ ఫార్మ్ చేయడం విశేషమనే చెప్పుకోవాలి. 


"డార్లింగ్" సినిమా ట్రైలర్ రిలీజ్ నుంచే నభా నటేష్ యాక్టింగ్ కు అప్రిషియేషన్స్ వచ్చాయి. ఇలాంటి పాత్రలో నటించాలనేది తన డ్రీమ్ గా చెప్పుకుందీ హీరోయిన్. "డార్లింగ్" సినిమాలో ప్రియదర్శితో కలిసి నభా నటేష్ నటించింది. ఈ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించారు. గతవారం "డార్లింగ్" సినిమా థియేటర్స్ లోకి వచ్చింది.

Post a Comment

Previous Post Next Post