Kajal Aggarwal's "Satyabhama" is Trending on Amazon Prime Video

 అమోజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతున్న కాజల్ అగర్వాల్ "సత్యభామ"



స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటించిన “సత్యభామ” సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ లో హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సినిమా గత నెల 28వ తేదీ నుంచి అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇండియా వైడ్ నెంబర్ 1 ప్లేస్ లో “సత్యభామ” ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమా అతితక్కువ సమయంలో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్థన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గత నెల 7వ తేదీన థియేట్రికల్ రిలీజ్ కు వచ్చింది సత్యభామ. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సత్యభామగా కాజల్ అగర్వాల్ నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.


ఓ హత్యకేసులో ఎమోషనల్ అయిన సత్యభామ ఆ కేసును ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఎలా సాల్వ్ చేసింది, బాధితురాలికి ఎలా న్యాయం చేసింది అనేది ఈ సినిమాలో హార్ట్ టచింగ్ గా, ఇంటెలిజెంట్ గా చూపించారు. సత్యభామలో కాజల్ అగర్వాల్ యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ అయ్యాయి. సత్యభామ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు.


Post a Comment

Previous Post Next Post