Feel Of Buddy Lyrical Video from Allu Sirish's BUDDY is out now

అల్లు శిరీష్ "బడ్డీ" సినిమా నుంచి 'ఫీల్ ఆఫ్ బడ్డీ'  రిలీజ్, ఈనెల 26న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ



అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "బడ్డీ". గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. జూలై 26న "బడ్డీ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు ఈ సినిమా నుంచి 'ఫీల్ ఆఫ్ బడ్డీ' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను హిప్ హాప్ తమిళ కంపోజ్ చేసి ఐరా ఉడుపితో కలిసి పాడారు. సాయి హేమంత్ లిరిక్స్ అందించారు. 'చూసాలే ఊసాలే నాలో నీ కలనే...దాచాలే దాచాలే నాలో ఆ కలనే..అంటూ హార్ట్ టచింగ్ గా ఈ పాట సాగుతూ ఆకట్టుకుంది.

నటీనటులు - అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్, అజ్మల్ అమీర్, ప్రిషా రాజేశ్ సింగ్, ముఖేష్ కుమార్, అలీ తదితరులు

టెక్నికల్ టీమ్

ఎడిటర్ - రూబెన్

సినిమాటోగ్రఫీ - కృష్ణన్ వసంత్

ఆర్ట్ డైరెక్టర్ - ఆర్ సెంథిల్

మ్యూజిక్ - హిప్ హాప్ తమిళ

బ్యానర్ - స్టూడియో గ్రీన్ ఫిలింస్

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

కో ప్రొడ్యూసర్ - నేహా జ్ఞానవేల్ రాజా

ప్రొడ్యూసర్ - కేఈ జ్ఞానవేల్ రాజా, అధన్ జ్ఞానవేల్ రాజా

రచన, దర్శకత్వం - శామ్ ఆంటోన్





 

Post a Comment

Previous Post Next Post