ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్, సంజయ్ దత్, ఛార్మీ కౌర్, పూరీ కనెక్ట్స్ 'డబుల్ ఇస్మార్ట్' మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్ లోడింగ్, ఆగస్ట్ 4న ట్రైలర్ రిలీజ్
ప్రతి కొత్త అప్‌డేట్‌తో డబుల్ ఇస్మార్ట్ కోసం యాంటిసిపేషన్ పెరుగుతూనే వుంది. ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పవర్ ఫుల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ హైబడ్జెట్ మూవీ హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటించి ఈ సినిమా మరింత ప్రతిష్టాత్మకంగా మారింది.
మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్ లోడింగ్, డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ ట్రైలర్ ఆగస్టు 4న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ట్రైలర్ పోస్టర్ లో రామ్ పోతినేని ఇంటెన్స్, మాస్ అప్పీల్ లుక్ లో కనిపించారు. రామ్ కమాండింగ్ ప్రజెన్స్ అదిరిపోయింది.
పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా కావ్య థాపర్ నటించింది. మాస్ట్రో మణి శర్మ సంగీతం అందించారు. సామ్ కె నాయు, జియాని జియాన్నెలీ సినిమాటోగ్రఫీ అందించారు.
డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇండిపెండెన్స్ డేకి మూవీ విడుదల కానుండడంతో ఎక్సయిట్మెంట్, యాంటిసిపేషన్ మరింతగా పెరిగాయి.
నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
వరల్డ్ వైడ్ రిలీజ్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ (నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి)
సీఈఓ: విషు రెడ్డి
సంగీతం: మణి శర్మ
సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి
స్టంట్ డైరెక్టర్: కేచ, రియల్ సతీష్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా