Chiyaan Vikram's Thangalaan First single "Manaki Manaki" lyrical video out now

 స్టూడియో గ్రీన్ ఫిలింస్ నిర్మాణంలో దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్న చియాన్ విక్రమ్ "తంగలాన్" సినిమా నుంచి 'మనకి మనకి..' లిరికల్ సాంగ్ రిలీజ్




చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ "తంగలాన్". ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. "తంగలాన్" సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. "తంగలాన్" సినిమా త్వరలోనే వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "తంగలాన్" సినిమా నుంచి 'మనకి మనకి..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.


'మనకి మనకి..' లిరికల్ సాంగ్ ను జీవీ ప్రకాష్ కుమార్ మంచి బీట్ తో కంపోజ్ చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించగా సింధూరి విశాల్ ఎనర్జిటిక్ గా పాడారు. 'మనకి మనకి మనలో మనకి పండగ వచ్చిందే చాన్నాళ్లకి ..అలికీ అలికీ ఊరే అలికీ.. ముగ్గులు ఏసేద్దాం ముంగిళ్లకీ..' అంటూ సాగుతుందీ పాట. ఓ శుభవార్త విన్న గూడెం ప్రజలంతా సంతోషంలో తేలిపోతున్న సందర్భంలో ఈ పాటను రూపొందించారు.


రీసెంట్ గా రిలీజ్ చేసిన "తంగలాన్" సినిమా ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అయ్యింది. "తంగలాన్" మూవీ మీద ఉన్న క్రేజ్ ను ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూపిస్తోంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు త్వరలోనే "తంగలాన్" సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.



నటీనటులు - చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై తదితరులు


టెక్నికల్ టీమ్


సంగీతం - జీవీ ప్రకాష్ కుమార్

ఆర్ట్ - ఎస్ ఎస్ మూర్తి

ఎడిటింగ్ - ఆర్కే సెల్వ

స్టంట్స్ - స్టన్నర్ సామ్

పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

బ్యానర్స్ - స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్

నిర్మాత - కేఈ జ్ఞానవేల్ రాజా

దర్శకత్వం - పా రంజిత్





Post a Comment

Previous Post Next Post