Akash Puri Changed his Name to Akash Jagannadh

 ఆకాష్ జగన్నాథ్ గా పేరు మార్చుకున్న యంగ్ హీరో ఆకాష్ పూరి



డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడిగా పలు సూపర్ హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు ఆకాష్ పూరి. హీరోగా మారి ఆంధ్రా పోరి, మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ వంటి విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ యంగ్ హీరో తన పేరు మార్చుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.


ఇకపై తన పేరును ఆకాష్ జగన్నాథ్ గా పెట్టుకుంటున్నట్లు ఆయన పోస్ట్ చేశారు. కంటెంట్ ఉన్న మంచి కథలతో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చేసుకుంటున్నారు ఆకాష్ జగన్నాథ్. త్వరలోనే ఆ సినిమాల వివరాలను ఆయన వెల్లడించనున్నారు. ఈ మధ్య ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ అనే క్లోత్ బ్రాండింగ్ కు అంబాసిడర్ గా వ్యవహరించారు ఆకాష్ జగన్నాథ్.



Post a Comment

Previous Post Next Post