హీరో శివాజీ చేతుల మీదుగా 'కాలం రాసిన కథలు' రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల
హీరో శివాజీ చేతుల మీదుగా 'కాలం రాసిన కథలు' రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల
యమ్ యన్ వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఆసక్తికరమైన చిత్రం కాలం రాసిన కథలు. ఈ చిత్రం రిలీజ్ డేట్ పోస్టర్ని హీరో శివాజీ గారు విడుదల చేశారు. పోస్టర్ విడుదల చేసిన అనంతరం, శివాజీ గారు మాట్లాడుతూ "ఈ చిత్రం టైటిల్ మరియు కాన్సెప్ట్ చాలా బాగున్నాయి. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది" అని అభిలాషిస్తూ టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
దర్శక నిర్మాతలు యమ్ యన్ వి సాగర్ సాగర్ మాట్లాడుతూ, "మచిలీపట్నం పెడన పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర సింహ భాగం షూటింగ్ జరిగింది. యూత్ ఫుల్ లవ్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గారు రూపొందిన మా చిత్రం ద్వారా నూతన నటీనటులు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ముఖ్యంగా ఐదు జంటల మధ్య జరిగే అద్భుతమైన సంఘర్షణలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే ట్విస్టులు ఈ సినిమాలో ఉన్నాయి. అంతే కాకుండా, సెకండ్ హాఫ్ లో శివుడి మీద ఉండే సన్నివేశాలు ప్రేక్షలులని రక్తి కట్టిస్తాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మరియు సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది" అని తెలిపారు.
తారాగణం: యమ్ యన్ వి సాగర్ , శృతి శంకర్ , వికాస్ , విహారికా చౌదరి, అభిలాష్ గోగుబోయిన, ఉమా రేచర్ల , రోహిత్ కొండ, హాన్విక శ్రీనివాస్ ,
రవితేజ బోనాల ,పల్లవి రాథోడ్ , రేష్మ
బ్యానర్: యస్ యమ్ 4 ఫిలిమ్స్
నిర్మాత- రచయిత- దర్శకుడు :
యమ్ యన్ వి సాగర్
సినిమాటోగ్రఫీ:ఎస్. ప్రసాద్
ఎడిటింగ్ :ప్రదీప్.జె
సంగీతం :మేరుగు అరమాన్
మోషన్ గ్రాఫిక్స్ :శరత్ జోస్యభట్ల
డి.ఐ: పివిబి భూషణ్
పబ్లిసిటీ డిజైనింగ్:
ఎం.పి.ఆర్ సినిమా స్టూడియో
యమ్ కే యస్ మనోజ్
పి ఆర్ ఓ : బి. వీరబాబు
ధీరజ్ -ప్రసాద్ లింగం