Tremendous Response for Big Brother

 శివ కంఠంనేని  'బిగ్ బ్రదర్ కు"

అన్ని కేంద్రాలలో బ్రహ్మాండమైన ఆదరణ!!



"రాజమౌళి ఆఫ్ భోజపురి"గా నీరాజనాలందుకుంటున్న దర్శకసంచలనం గోసంగి సుబ్బారావు సుదీర్ఘ విరామం అనంతరం తెలుగులో దర్శకత్వం వహించిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ "బిగ్ బ్రదర్".  మే 24న ఉభయ తెలుగు రాష్ట్రాలలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తోంది.  "లైట్ హౌస్ సినీ మ్యాజిక్" పతాకంపై కె.ఎస్.శంకర్ రావు - ఆర్.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో బహుముఖ ప్రతిభాశాలి - అవార్డ్స్ విన్నింగ్ పెర్ఫార్మర్ శివ కంఠంనేని టైటిల్ పాత్ర పోషించారు. జి.రాంబాబు యాదవ్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఘంటా శ్రీనివాసరావు కార్యనిర్వాహక నిర్మాత. శివ కంఠంనేని సరసన ప్రియా హెగ్డే హీరోయిన్ గా నటించింది. సీనియర్ నటులు గౌతంరాజు, గుండు సుదర్శన్, రాజేంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషించారు!!


తాను టైటిల్ పాత్ర పోషించిన "బిగ్ బ్రదర్" చిత్రానికి వస్తున్న విశేష స్పందనపై చిత్ర కథానాయకుడు శివ కంఠంనేని సంతోషం వ్యక్తం చేశారు. నటుడిగా తనకొస్తున్న కాంప్లిమెంట్స్ తాలూకు క్రెడిట్ లో సింహభాగం...  

చిత్ర దర్శకుడు గోసంగి సుబ్బారావుకు చెందుతుందని ఈ సందర్భంగా శివ కంఠంనేని పేర్కొన్నారు. "బిగ్ బ్రదర్" చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులకు, ఇందులో నటించిన నటీనటులు అందరికీ ఆయన పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు!!


శ్రీసూర్య, ప్రీతి మరో జంటగా నటించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్-అప్పాజీ, డాన్స్: రాజు పైడి, స్టంట్స్: రామకృష్ణ, ఎడిటింగ్: సంతోష్, కెమెరా: ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఘంటా శ్రీనివాసరావు, సమర్పణ: జి.రాంబాబు యాదవ్, నిర్మాతలు: కె.ఎస్.శంకర్ రావు - ఆర్.వెంకటేశ్వరరావు, రచన - దర్శకత్వం: గోసంగి సుబ్బారావు!!

Post a Comment

Previous Post Next Post