Prabhas Joined Kannappa Sets

 విష్ణు మంచు 'కన్నప్ప' సెట్‌లో అడుగు పెట్టిన ప్రభాస్



విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్‌ వంటి వారు కన్నప్ప సెట్‌లో అడుగు పెట్టి షూటింగ్‌లను పూర్తి చేశారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియ హీరో డార్లింగ్ ప్రభాస్ అధికారికంగా సెట్‌లోకి అడుగుపెట్టారు.


విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన ఈ కన్నప్పను మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివుని భక్తుడైన భక్త కన్నప్ప అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని చూపించబోతున్నారు.


"కన్నప్ప"లో ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీతో సహా ఆకట్టుకునే అద్భుతమైన టీం పని చేస్తోంది. ఆకర్షణీయమైన విజువల్స్, అద్భుతమైన కథ, కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Post a Comment

Previous Post Next Post