Legendary Comedy Star Brahmanandam Joins the Cast of 'Mahendragiri Vaarahi'

 సుమంత్ మహేంద్రగిరి వారాహి లో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం  !



రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతున్న ప్రొడక్షన్‌ నెంబరు - 2 చిత్రం మహేంద్రగిరి వారాహి.  ఈ చిత్ర గ్లిమ్స్ ను ఇటీవల ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు అలాగే గ్రిమ్స్ ఆసక్తికరంగా ఉందని తన ట్విట్టర్ ఖాతాలో టాలెంటెడ్ యాక్టర్ విశ్వక్ సేన్ పోస్ట్ చేశారు, గ్లిమ్స్ కు విశేష స్పందన లభించింది.


లేటెస్ట్ గా మహేంద్రగిరి వారాహి సినిమాలో విలక్షణ నటుడు బ్రహ్మానందం నటిస్తున్నట్లు చిత్ర దర్శకుడు సంతోష్ జాగర్లపూడి, నిర్మాత కాలిపు మధు వెల్లడించారు. మహేంద్రగిరి వారాహి స్క్రిప్ట్ అద్భుతంగా నచ్చి బ్రహ్మానందం ఈ సినిమా చేయబోతున్నారని, త్వరలో మొదలుకాబోయే షెడ్యూల్ లో బ్రహ్మానందం పాల్గొనబోతున్నారని చిత్ర దర్శకులు సంతోష్ జాగర్లపూడి తెలిపారు.


మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర నిర్మాత కాలిపు మధు తెలిపారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.


Post a Comment

Previous Post Next Post