Darling Shoot Completed

 ప్రియదర్శి, నభా నటేష్, అశ్విన్ రామ్, కె నిరంజన్ రెడ్డి, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ 'డార్లింగ్' షూటింగ్ పూర్తి



పాన్ ఇండియా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హను-మాన్‌ని అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి నిర్మాతగా, శ్రీమతి చైతన్య సమర్పణలో, వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి హీరోగా రూపొందుతున్న చిత్రం 'డార్లింగ్'.  నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ రొమ్-కామ్‌ ఎంటర్ టైనర్ కి అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.


తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. 'వై దిస్ కొలవెరి' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ తో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇటివలే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ కు హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే మేకర్స్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేయనున్నారు. హను-మాన్ నిర్మాతల నుంచి వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.


పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ సినిమాలో అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులఈ చిత్రానికి పని చేస్తున్నారు. నరేష్ డీవోపీ కాగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. హేమంత్ డైలాగ్స్ రాయగా, లవ్ టుడే ప్రదీప్ ఈ రాఘవ్ చిత్రానికి ఎడిటర్. గాంధీ ప్రొడక్షన్ డిజైనర్.


నటీనటులు: ప్రియదర్శి, నభా నటేష్


సాంకేతిక విభాగం:

దర్శకత్వం: అశ్విన్ రామ్

సంగీతం: వివేక్ సాగర్

డీవోపీ: నరేష్

ఎడిటర్: ప్రదీప్ ఈ రాఘవ

డైలాగ్స్: హేమంత్

ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ

పబ్లిసిటీ డిజైనర్: అనంత్ కంచర్ల

క్రియేటివ్ ప్రొడ్యూసర్: సీతారామ్ వై

సాహిత్యం: కాసర్ల శ్యామ్

కొరియోగ్రాఫర్: విజయ్ పోలాకి, ఈశ్వర్ పెంటి

ప్రాజెక్ట్ కన్సల్టెంట్: సన్నీ బాండ్

కాస్ట్యూమ్ డిజైనర్: పూర్ణిమా రామస్వామి,

ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: ప్రకాష్ రెడ్డి పన్నాల, వంశీ సంగెం

లైన్ ప్రొడ్యూసర్: మంచి వెంకట్

పీఆర్వో: వంశీ-శేఖర్

డిజిటల్: హాష్‌ట్యాగ్ మీడియా


Post a Comment

Previous Post Next Post