Family Hero Srikanth Inaugurated Babai Hotel in Nallagandla

 నల్లగండ్లలో బాబాయ్ హోటల్‌ను ప్రారంభించిన హీరో శ్రీకాంత్ 



బాబాయ్ హోటల్ తెలుగు రాష్ట్రాల్లోని ఫుడ్ లవర్స్‌కు అడ్డాగా మారింది. అద్భుతమైన రుచులతో అన్ని రకాల టిఫిన్స్‌ను అందిస్తోంది. ఈ ఐకానిక్ రెస్టారెంట్ ప్రస్తుతం అన్ని ఏరియాల్లోకి విస్తరిస్తోంది. 2022లో బాబాయ్ హోటల్ హైదరాబాద్‌కు వచ్చింది. గత నెలలో మాదాపూర్‌లో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో తమ ఐదవ బ్రాంచ్‌ను కూడా ప్రారంభించేశారు.


 కెవి దినేష్ రెడ్డి, శ్రేష్ఠ రెడ్డి కలిసి మదీనా గూడ, మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన రెండు బ్రాంచ్‌లు విజయ వంతంగా దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో లింగంపల్లిలోని నల్లగండ్లలో ఇప్పుడు బాబాయి హోటల్ మూడో బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ రెస్టారెంట్‌ను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. బాబాయ్ హోటల్ నిర్వాహకులు కెవి దినేష్ రెడ్డి, శ్రేష్ఠ రెడ్డి, మరికొందరు అతిథులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నూతన బ్రాంచ్‌ను ప్రారంభించడం పట్ల యాజమాన్యం సంతోషం వ్యక్తం చేస్తూ నల్లగండ్లలో న్యూ బ్రాంచ్‌ను ప్రారంభించిన హీరో శ్రీకాంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post