Software Poraga song From Market Mahalakshmi is out now

 'మార్కెట్ మహాలక్ష్మి' నుంచి "సాఫ్ట్‌వేర్ పోరగా" సాంగ్ రిలీజ్



కేరింత మూవీ ఫెమ్ హీరో  పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషించనున్నారు. 


వినూత్న ప్రమోషన్లతో సినిమా సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈరోజు మేకర్స్ ఈ చిత్రం యొక్క మొదటి పాట "సాఫ్ట్‌వేర్ పోరగా" లిరికల్ వీడియోను ఆవిష్కరించారు. మన మార్కెట్ మహాలక్ష్మి  ప్రణీకాన్విక మనసుని గెలుచుకోవాలనే తపనతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పార్వతీశం చేసిన ప్రయత్నాలను ఈ సాంగ్ ద్వారా వివరిస్తుంది.


మార్కెట్‌ నుండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న హీరో, అతను ఎదుర్కొనే పరిస్థితులు ఎంతో ఆహ్లాదకరంగా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. డైరెక్టర్ 'విఎస్ ముఖేష్' రాసిన పదాలు, జో ఎన్ మవ్ గ్రూవీ బీట్‌లు మరియు లోకేశ్వర్ ఎడార యొక్క ఎనర్జిటిక్ వాయిస్ ఈ క్రేజీ సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇది ప్రేక్షకులను ఖచ్చితంగా అలరింప చేస్తుంది. ఈ సాంగ్ రాబోయే రోజుల్లో వైరల్ గా అయ్యే అవకాశం పుష్కలంగా కనబడుతున్నాయి.


సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కి, కూరగాయల వ్యాపారి కి మధ్య జరిగే ప్రేమకథే ఈ చిత్రం. అతి త్వరలో థియేటర్లలో సినిమా సందడి చేయనుంది.


నటీనటులు: పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్, తదితరులు.... 

 

టెక్నికల్ టీమ్:

రచన & దర్శకత్వం: వియస్ ముఖేష్

ప్రొడ్యూసర్: అఖిలేష్ కలారు

ప్రొడక్షన్ హౌస్: బి2పి స్టూడియోస్ 

సంగీతం: జో ఎన్ మవ్

సినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుముల

ఎడిటర్: ఆర్.యమ్. విశ్వనాధ్ కూచనపల్లి

పాటలు: వియస్ ముఖేష్, మిష్టర్ జో

బ్యాగ్రౌండ్ స్కోర్: సృజన శశాంక

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: లోకేష్. పి

కొరియోగ్రఫీ: రాకీ

ఆర్ట్ డైరెక్టర్: సంజన కంచల

కాస్ట్యూమ్ డిజైనర్: ప్రియాంక పాండ

పోస్టర్ డిజైనర్: రానా

పీఆర్వో: తిరుమలశెట్టి వెంకటేష్

Post a Comment

Previous Post Next Post