Gam Gam Ganesha" team unveiled a new poster wishing hero Anand Deverakonda on his birthday

హీరో ఆనంద్ దేవరకొండకు బర్త్ డే విశెస్ చెబుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసిన "గం..గం..గణేశా" మూవీ టీమ్


యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది "గం..గం..గణేశా" చిత్రబృందం. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది కావడం విశేషం.


"గం..గం..గణేశా" మూవీ కొత్త పోస్టర్ లో రకరకాల ఆయుధాలు పట్టుకుని మీదకు వస్తున్న విలన్స్ ను నవ్వుతూ చూస్తున్న ఆనంద్ దేవరకొండ స్టిల్ ఉంది. ఈ విలన్స్ తో పాటే రోజ్ ఫ్లవర్ ఇస్తున్న హీరోయిన్ ను కూడా చూపించడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రస్తుతం "గం..గం..గణేశా" సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రానుంది.

నటీనటులు :
ఆనంద్ దేవరకొండ,ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ తదితరులు.

టెక్నికల్ టీమ్ :

పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా
కాస్ట్యూమ్ డిజైనర్ : పూజిత తాడికొండ
ఆర్ట్: కిరణ్ మామిడి
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి
సంగీతం - చేతన్ భరద్వాజ్
బ్యానర్ - హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్
కొరియోగ్రఫీ: పొలాకి విజయ్
కో-ప్రొడ్యూసర్ -అనురాగ్ పర్వతనేని
నిర్మాతలు - కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి
రచన, దర్శకత్వం - ఉదయ్ శెట్టి


Post a Comment

Previous Post Next Post