Home » » Aarambham Second lyrical 'Amayakanga', sung by the heroine Shivani Nagaram is out now

Aarambham Second lyrical 'Amayakanga', sung by the heroine Shivani Nagaram is out now

 ఎమోషనల్ థ్రిల్లర్ "ఆరంభం" నుంచి హీరోయిన్ శివాని నాగరం పాడిన రెండవ లిరికల్ సాంగ్ 'అమాయకంగా..' రిలీజ్



మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా "ఆరంభం". ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న "ఆరంభం" సినిమా నుంచి ఇవాళ రెండవ లిరికల్ సాంగ్ 'అమాయకంగా..' రిలీజ్ చేశారు.


సింజిత్ యెర్రమిల్లి సంగీతాన్ని అందించిన ఈ పాటకు శ్రీకాంత్ అల్లపు లిరిక్స్ రాశారు. ఇటీవల "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శివాని నాగరం ఈ పాటను పాడటం విశేషం. 'అమాయకంగా హడావుడేమి లేక..తార చేరుకుందా ఇలా. అయోమయంగా తలాడించులాగ, నేల మారుతుందే ఎలా..కాలానికే కొత్త రంగు పూసే, మాయతార సొంతమేగా, హాయి సంతకాలు చేసేనా..' అంటూ లవ్ ఫీల్ తో బ్యూటిఫుల్ కంపోజిషన్ తో సాగుతుందీ పాట. ఈ పాటకు శివాని నాగరం వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


"ఆరంభం" సినిమా ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.


నటీనటులు - మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల, బోడెపల్లి అభిషేక్, సురభి ప్రభావతి తదితరులు


టెక్నికల్ టీమ్

ఎడిటర్ - ఆదిత్య తివారీ, ప్రీతమ్ గాయత్రి

సినిమాటోగ్రఫీ - దేవ్ దీప్ గాంధీ కుందు

మ్యూజిక్ - సింజిత్ యెర్రమిల్లి

డైలాగ్స్ - సందీప్ అంగిడి

సౌండ్ - మాణిక ప్రభు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వినయ్ రెడ్డి మామిడి

సీఈవో - ఉజ్వల్ బీఎం

బ్యానర్ - ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్

ప్రొడ్యూసర్ - అభిషేక్ వీటీ

దర్శకత్వం - అజయ్ నాగ్ వీ


Share this article :