మాజీ మంత్రి వర్యులు KTR ఆవిష్కరించిన "సముద్రుడు" ఫస్ట్ లుక్
కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధా వత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ "సముద్రుడు". అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ నేడు చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నగేష్ నారాదాసి మాట్లాడుతూ "మత్యకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన చిత్రమిది.మా చిత్రంలో పెద్ద ఆర్టిస్టులు అందరూ నటించారు. ఈ రోజు మా చిత్ర టీజర్ ను తెలంగాణ మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారు , తన చేతుల మీదుగా అవిష్కరించి , ఒక సోషియో ఎలిమెంట్ ని కమర్షియల్ గా మలిచి సినిమా రూపొందించడం అభినందనీయమని అనడం సంతోషం గా ఉంది.అలాగే మా సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది . తెలుగు ప్రేక్షకులందరు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను.అని అన్నారు
హీరో రమాకాంత్ మాట్లాడుతూ "మా సముద్రుడు చిత్ర టీజర్ ను కేటీఆర్ గారు రిలీజ్ చేయడం సంతోషం గా వుంది. ఈ సందర్భo గా కేటీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను .అన్ని కమర్షియల్ హంగులతో మా చిత్రాన్ని మే నెల 3వ తేదీన రిలీజ్ చేస్తున్నాం . అందరు చూసి మమ్మలని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను"అని అన్నారు.
రమాకాంత్, అవంతిక, భానుశ్రీ, సుమన్, శ్రవణ్, రామరాజు, రాజ్ ప్రేమి, సమ్మెట గాంధీ, ప్రభావతి, జబర్దస్త్ శేష్, చిత్రం శ్రీను తదతరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, ఎడిటర్: నందమూరి హరి, కొరియో గ్రఫి: అనీష్, శ్యామ్,
పి ఆర్ ఓ: బి. వీరబాబు,
ప్రొడ్యూసర్స్: బదావత్ కిషన్, కో ప్రొడ్యూసర్స్:శ్రీ రామోజు జ్ఞానేశ్వరరావు, సోములు, కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం: నగేష్ నారదాసి
Post a Comment