పారానార్మాల్ డిటెక్టివ్ గా డాక్టర్ యోగి..
అకీరా డ్రీమ్ క్రియేషన్స్ పతాకం పై యోగేష్, ఆకృతి అగర్వాల్, హీరో హీరోయిన్ గా సన్నీ లియోన్ మరో ప్రధాన పాత్రలో నిర్మితమవుతున్న చిత్రం ' డాక్టర్ యోగి డైరీస్ '.
ఇటీవల ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం పూజా కార్యక్రమం జరిగింది. పారానార్మల్ థ్రిల్లర్ గా సరికొత్త కథ,కథనాలతో హర్షవర్ధన్, శ్రీదేవి మద్దాలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాజేష్ - ప్రసాద్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమానికి దర్శకులు వీర శంకర్, చంద్ర మహేష్, వి.ఎన్. ఆదిత్య, గవిరెడ్డి శ్రీనివాస్,సూర్యతేజ, గీతా ఆర్ట్స్ అనీష్, వెంకటేష్, ఎన్.ఎస్. గంగాధర్ 99టీవీ గంగాధర్ , తదితరులు హాజరయ్యారు.
దర్శకులు వీర శంకర్ క్లాప్ కొట్టగా,వి.ఎన్.ఆదిత్య కెమెరా స్విచ్ ఆన్ చేశారు, చంద్ర మహేష్ గౌరవ దర్శకత్వం వహించారు.
నిర్మాత హర్షవర్ధన్ మాట్లాడుతూ..
చాలా కాలంగా మంచి కథలకోసం వేట మొదలుపెట్టాం.. అలా కుదిరిన కథే ఈ డాక్టర్ యోగి డైరీస్. రాజేష్ - ప్రసాద్ లు కథ చెప్పగానే లైవ్ లో ఇలా కూడా జరుగుతుందా అనే ఆశ్యర్యానికి లోనయ్యాను.. అంతలా కథతో ఇప్రేస్ చేశారు. ప్రతిదీ చాలా ప్లానింగ్ గా వర్క్ చేస్తున్నారు. 45 రోజుల్లో షూటింగ్ పూర్తి చెయ్యటానికి ప్లాన్ చేశాం. అలాగే ఈ చిత్రానికి Rx 100 fame చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తి ఐయ్యింది .
మరో నిర్మాత శ్రీదేవి మద్ధాలి మాట్లాడుతూ...
మంచి కథలను ప్రేక్షకులు ఆక్సెప్ట్ చేస్తారు.. అలా అందరినీ ఆకట్టుకునే కథతో మా డాక్టర్ యోగి డైరీస్ వుంటుంది. మేము కథ చెప్పగానే సన్నీ లియోన్ చెయ్యటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే అన్ని భాషలలో సూపర్ హిట్ ఐన సీఐడీ సీరీస్ లో అభిజిత్ గా సుపరిచితులు ఐన ఆదిత్య శ్రీ వాస్తవ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.
నటుడు ఆదిత్య శ్రీ వాస్థవ్ మాట్లాడుతూ...
తెలుగు లో ఇది నా తొలి సినిమా.. గతంలో తెలుగు నుండి కొన్ని ఆఫర్స్ వచ్చినా కొన్ని కథ నచ్చకో, డేట్స్ అడ్జెస్ట్ కాక చెయ్యలేకపోయాను. ఇప్పుడు కథ, డేట్స్ రెండు కుదరటం తో డాక్టర్ యోగి డైరీస్ తో మీ ముందుకు వస్తున్నాను. ఇందులో హీరో గా చేస్తున్న యోగేష్ ఖచ్చితంగా పెద్ద హీరో ల లిస్ట్ లో చేరతాడు.
హీరో యోగేష్ మాట్లాడుతూ ...
ఇది నా మొదటి సినిమా.. ఇందులో నేను, సన్నీ లియోన్ డిటెక్టివ్ లు గా చేస్తున్నాం. డైరెక్టర్స్ రాజేష్ - ప్రసాద్ గార్లు కథ చాలా బాగా చేశారు. అలాగే నన్ను వాళ్ళ కథ కి హీరో గా అవకాశం ఇచ్చినందుకు ఇద్దరికి ధన్యవాదాలు. ప్రొడ్యూసర్స్ కాంప్రమైజ్ కాకుండా కాస్టింగ్, టెక్నీషియన్స్ విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముట్టా రాజేందర్, ఆదిత్య శ్రీ వాస్తవ్, నాజర్ , ప్రవీణ్ లాంటి పెద్ద నటులతో స్క్రీన్ షేర్ చేసుకోవటం చాలా ఆనందం గా వుంది. 2024 లో ప్రేక్షకులకు ఒక మంచి పరానార్మల్ థ్రిల్లర్ తో అలరిస్తామని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలను. అని అన్నారు.
డి.ఓ.పి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ..
మంచి కథ, లొకేషన్స్ సెట్ ఐతే ఫోటోగ్రఫీ కి ఆస్కారం చాలా ఎక్కువగా వుంటుంది. అలా సెట్ ఐన సినిమా అవుతుంది ఈ డాక్టర్ యోగి డైరీస్. డైరెక్టర్స్ కి ఇది ఫస్ట్ సినిమా ఐన విజన్ చాలా క్లారిటీ గా వివరిస్తున్నారు. ఫ్యూచర్ లో మంచి స్థాయి కి వెళ్తారు అని అన్నారు.
సంగీత దర్శకులు చైతన్ భరద్వాజ్ మాట్లాడుతూ...
RX 100 తరువాత మళ్ళీ ఆ రేంజ్ లో ఒక కొత్త కథ ఈ డాక్టర్ యోగి డైరీస్ వుంటుంది. పారానర్మల్ థ్రిల్లర్ ఇది. ఇందులో మొత్తం నాలుగు పాటలు వుంటాయి. సన్నీలియోన్ తో వున్న పాట సినిమాకి హైలైట్ గా వుంటుంది. డైరెక్టర్స్ స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారు. అని అన్నారు.
దర్శకులు రాజేష్ - ప్రసాద్ లు మాట్లాడుతూ...
కథని నమ్మి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన నిర్మాతలు హర్షవర్ధన్, శ్రీదేవి గారికి ధన్యవాదాలు. Dop గా ప్రభాకర్ రెడ్డి సపోర్ట్ చాలా బాగుంది. హీరో యోగేష్ , సన్నీలియోన్ , ఆదిత్య శ్రీ వాస్తవ్, మరో హీరోయిన్ ఆకృతి అగర్వాల్ లు సినిమా కి అస్సెట్ గా నిలుస్తారు. Rx 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం , కథనం ఫ్రెష్ గా వుంటుంది. అని చెప్పారు.
నటీనటులు : యోగేష్, ఆకృతి అగర్వాల్, సన్నీలియోన్, ఆదిత్య శ్రీ వాస్తవ , ముట్టా రాజేందర్, నాజర్, ప్రవీణ్, షకలక శంకర్, జీవా ,మెల్కోటి, సూర్య తదితరులు..
ఈ చిత్రానికి
సమర్పణ : కృష్ణ మోహన్ - శ్రీవల్లి
ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రవి ఆల్తి
పి.ఆర్. ఓ : వీరబాబు
డి. ఓ. పి : ప్రభాకర్ రెడ్డి
సంగీతం : చైతన్ భరద్వాజ్
ప్రొడ్యూసర్స్ : హర్షవర్ధన్ , శ్రీదేవి మద్దాలి
రచన, దర్శకత్వం : రాజేష్ - ప్రసాద్.