Home » » Vishwak Sen Launched Kismath Title Song

Vishwak Sen Launched Kismath Title Song

 మాస్ కా దాస్ విష్వక్‌సేన్ లాంచ్ చేసిన కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ ‘కిస్మత్‌' టైటిల్ సాంగ్



నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వ దేవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న బడ్డీ కామెడీ ఎంటర్ టైనర్ ‘కిస్మత్‌'. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.


తాజాగా మాస్ కా దాస్ హీరో విష్వక్‌సేన్ 'కిస్మత్' టైటిల్ సాంగ్ ని లాంచ్ చేశారు. మార్క్ కె రాబిన్ ఈ పాటని స్ట్రయికింగ్ అండ్ క్యాచి నెంబర్ గా కంపోజ్ చేశారు. హేమచంద్ర పాడిన ఈ పాటకు భాస్కరబట్ల అందించిన సాహిత్యం ఆకర్షణీయంగా వుంది. 'లెఫ్టే రైటై పోవచ్చు, లైఫే టర్న్ అయిపోవచ్చు, పట్టుకుంటే మన్ను కూడా మలబార్ గోల్డ్ అయిపోవచ్చు, జాక్ పాటే పాటే తగలొచ్చు.. ట్రాకే మారిపోవచ్చు, ఎపుడూ చూడని వండర్స్ వన్ డేలోనే జరగొచ్చు'' పాటలో వినిపించిన ఈ లిరికల్ లైన్స్ కథ, పాత్రలని ఆసక్తికరంగా తెలియజేసేలా వున్నాయి.


రియా సుమన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజు నిర్మిస్తున్నారు. సిహెచ్ భానుప్రసాద్ రెడ్డి సహ నిర్మాత. ఈ చిత్రానికి వేదరామన్ శంకరన్ డీవోపీగా పని చేస్తున్నారు. విప్లవ్ నైషధం ఎడిటర్.


‘కిస్మత్‌’ ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది.

 

తారాగణం: నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, అవసరాల శ్రీనివాస్, విశ్వ దేవ్, రియా సుమన్, అజయ్ ఘోష్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర, రచ్చ రవి


సాంకేతిక విభాగం:

దర్శకత్వం: శ్రీనాథ్ బాదినేని

నిర్మాత: రాజు

సహ నిర్మాత: సిహెచ్ భానుప్రసాద్ రెడ్డి

బ్యానర్లు: కామ్రెడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్

డీవోపీ: వేదరామన్ శంకరన్

సంగీతం: మార్క్ కె రాబిన్

ఎడిటర్: విప్లవ్ నైషధం

ఆర్ట్: రవి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భరత్ రెడ్డి

పీఆర్వో: వంశీ-శేఖర్



Share this article :