Telugu Film Producers Council On Hanu-Man Theaters Issue

 


ప్రెస్  నోట్ (మీడియా సమాచారం) Dt. 13.01.2024

మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ LLP వారు "హనుమాన్" సినిమా 12-01-2024 నుండి  ప్రదర్శన కొరకు తెలంగాణాలో కొన్ని థియేటర్లు వారితో అగ్రీమెంటు చేయడం జరిగింది. కానీ ఆ థియేటర్ల వారు ఈ  అగ్రీమెంటు ను బేఖాతరు చేస్తూ నైజాం ఏరియా  థియేటర్ల లో ఈ  సినిమా ప్రదర్శన చేయ లేదు .  

దీని విషయమై  మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ మరియు నిర్మాత నిరంజన్ రెడ్డి గార్లు ఫిర్యాదు చేయడం జరిగింది.  థియేటర్లు అగ్రీమెంటు ప్రకారం "హనుమాన్" సినిమా ప్రదర్శన చేయకపోవడం వలన డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు ఆపార నష్టం జరిగింది.  కాబట్టి ఈ థియేటర్లు వెంటనే  "హనుమాన్" సినిమా ప్రదర్శనను ప్రారంభించడంతో పాటు ఇప్పటి వరకు  జరిగిన నష్టం భరించాలి.  

థియేటర్ల వారి ఇటువంటి చర్యల వలన తెలుగు సినిమా పరిశ్రమ మనుగడకే ప్రమాదం.  థియేటర్లు వారు చేసిన ఈ చర్యను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండిస్తూ మరియు ఇటువంటి అనైతిక చర్యలను నిరసిస్తూ నమ్మకం నైతికత నిబద్దత న్యాయం ఆధారంగా ముందుకు నడిచే యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ న్యాయానికి విరుద్ధంగా వ్యవహరించిన సదరు ప్రదర్శకులు వారి పూర్వ ఒప్పందాన్ని గౌరవిస్తూ "హనుమాన్" సినిమాకి సత్వర న్యాయం చేయాలనీ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కోరుచున్నది.  



(కె. ఎల్. దామోదర్ ప్రసాద్)     (తుమ్మల ప్రసన్న కుమార్) (వై.వి.ఎస్. చౌదరి)

           అధ్యక్షులు గౌరవ కార్యదర్శి                  గౌరవ కార్యదర్శి

Post a Comment

Previous Post Next Post