కింగ్ నాగార్జున అక్కినేని, విజయ్ బిన్ని, శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ 'నా సామిరంగ' నుంచి భాస్కర్ గా రాజ్ తరుణ్ 80's ప్రేమకథ పరిచయం
కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెన్ తో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోస్టర్‌లు, ఫస్ట్ టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ రోజు మేకర్స్ నా సామిరంగ నుంచి రాజ్ తరుణ్ ని భాస్కర్ గా పరిచయం చేస్తూ గ్లింప్స్ ని విడుదల చేశారు. గ్లింప్స్ లో భాస్కర్ (రాజ్ తరుణ్), కుమారి (రుక్సార్ ధిల్లన్)ల 1980 నాటి ప్రేమకథని చాలా అందంగా పరిచయం చేశారు.
''మనసు ప్రేమించే వరకే బావుటుంది. ప్రేమించగానే అలోచించడం మానేస్తుంది. తనకోసం ఏదైనా చేసేయొచ్చు, ఏమడిగిన ఇచ్చేవచ్చు అనిపిస్తది. అలా ఇచ్చినపుడు తన మొహం మీద వచ్చే చిరునవ్వు. అది చూసి మన మనసులో కలిగే ఆనందం. దాని కోసం పక్క ఊరి ప్రెసిడెంట్ గారి గోడ ఏంటి ? చైనా గోడ దూకిన తప్పు లేదు' అంటూ రాజ్ తరుణ్ వాయిస్ ఓవర్, దానికి అనుగుణంగా కాలేజీ నేపధ్యంలో చిత్రీకరించిన విజువల్స్ చాలా అద్భుతంగా వున్నాయి.
రాజ్ తరుణ్, రుక్సార్ జోడి చాలా అందంగా కనిపించింది. వారి వింటేజ్ స్టొరీస్ చాలా ప్లజెంట్ గా మనసుని హత్తుకుంది. ఈ గ్లింప్స్ కు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఇచ్చిన నేపధ్య సంగీతం మరింత ఆకర్షణ తీసుకొచ్చింది.
మంచి ప్రేమకథ, స్నేహం, భావోద్వేగాలు, మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ కూడిన నా సామిరంగ సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ. ప్రోమోస్ అన్నీ ప్రామిసింగ్ గా వున్నాయి.
ఈ చిత్రంలో నాగార్జున సరసన ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి శివేంద్ర దాశరధి సినిమాటోగ్రఫీ అందించారు.
బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు.
నా సామిరంగ జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది.
తారాగణం: కింగ్ నాగార్జున అక్కినేని, అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, రాజ్ తరుణ్
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: విజయ్ బిన్ని
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సంగీతం: ఎంఎం కీరవాణి
డీవోపీ: శివేంద్ర దాశరధి
సమర్పణ: పవన్ కుమార్
కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
సాహిత్యం: చంద్రబోస్
పీఆర్వో: వంశీ-శేఖర్