షూటింగ్ పూర్తి చేసుకున్న `పింకీ`
ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల!!
విఆర్ పి క్రియేషన్స్ పతాకంపై పి.పద్మావతి సమర్పణలో కిరణ్, మౌర్యాణి జంటగా సుమన్ , శుభలేఖ సుధాకర్, రవి అట్లూరి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం `పింకీ`. సీరపు రవి కుమార్ దర్శకత్వంలో పసుపులేటి వెంకట రమణ నిర్మిస్తోన్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి మొదటి వారంలో గ్రాండ్ గా విడదులకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా ఈ రోజు ఫిలించాంబర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, సాయి వెంకట్ తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ..``జనం, జరిగిన కథ చిత్రాలు చేసిన దర్శక నిర్మాత పసుపులేటి వెంకట రమణ గారు. ఆయన దర్శకుడు అయ్యుండి మరో దర్శకుడికి అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. తన నిర్మాణంలో వస్తోన్న ఈ పింకీ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా`` అన్నారు.
మరో అతిథి సాయి వెంకట్ మాట్లాడుతూ..``ఈ మధ్యే వెంకట రమణ గారు జనం అనే సినిమాతో విజయం సాధించారు. ఆయన దర్శకుడు అయినా కూడా మరో దర్శకుణ్ని ఎంకరేజ్ చేస్తూ పింకీ సినిమా చేయడం అభినందించదగ్గ విషయం. సుమన్ గారు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రం టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు`` అన్నారు.
నటుడు రవి అట్లూరి మాట్లాడుతూ..`ఈ చిత్రంలో సీనియర్ ఆర్టిస్ట్ చేయాల్సిన పాత్ర ఇచ్చినన్ను ప్రోత్సహించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు`` అన్నారు.
హీరో కిరణ్ మాట్లాడుతూ...``నాకు ఈ చిత్రంలో హీరోగా అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు సినిమా. ఈ సినిమా విడుదలకోసం ఆతృతగా ఎదురు చూస్తున్నా`` అన్నారు.
దర్శకుడు సీరపు రవి కుమార్ మాట్లాడుతూ...``ఇది నా మొదటి సినిమా. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా సినిమా బాగా రావడానికి సహకరించారు. ఒక డైమండ్ కోసం జరిగే అన్వేషణే ఈ చిత్రం. ఫ్యామిలీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్`` అన్నారు.
నిర్మాత పసుపులేటి వెంకట రమణ మాట్లాడుతూ..``1980 లోమద్రాసు వెళ్లి అక్కడ ప్రముఖులతో పని చేశాను. ఆ తర్వాత జరిగిన కథ, జనం చిత్రాలు స్వీయ దర్శకత్వంలో నిర్మించాను. వాటికి మంచి పేరొచ్చింది. ఆదర్శ భావాలతో ఆ రెండు చిత్రాలు చేశాను. ప్రజంట్ జనం పార్ట్ 2 షూటింగ్ లో ఉంది. సీరపు రవి కుమార్ చెప్పిన కథ నచ్చడంతో `పింకీ` అనే చిత్రాన్ని నిర్మిస్తున్నా. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. సెన్సార్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దర్శకుడు అన్నీ తానై ఈ చిత్రాన్ని రూపొందించాడు`` అన్నారు.
ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ...`` పింకీ టైటిల్ తో వివిధ భాషల్లోవచ్చిన చిత్రాలన్నీ ఘన విజయం సాధించాయి. ఎన్నో అవార్డ్స్ అందుకున్నాయి. అలాంటి క్యాచీ టైటిల్ తో వస్తోన్న ఈ చిత్రం కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. వెంకట రమణ గారు వరుసగా చిత్రాలు చేస్తూ..ఓ కొత్త దర్శకుడి అవకాశం కల్పిస్తూ ఈ సినిమా చేయడం మెచ్చుకోవాల్సిన విషయం. కొత్త వారికి అవకాశాలు కల్పిస్తూ చేసే చిత్రాలను ఆదరిస్తే ఇంకా ఎంతో మందికి అవకాశాలు వస్తాయి. రవికుమార్ ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ చిత్రం చేసినట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు`` అన్నారు.
కిరణ్, మౌర్యాణి, సుమన్, శుభలేఖ సుధాకర్, రవి తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి డీఓపిః అమర్; ఎడిటింగ్ః నాని కారుమంచి; సంగీతంః చిన్నా( చెన్నయ్); పీఆర్ ఓః బాక్సాఫీస్ రమేష్; కో-ప్రొడ్యూసర్ః ఎమ్ బి (మల్లిబాబు); .డా.సాయిమల్లి అరుణ్ రామ్; నిర్మాతః పసుపులేటి వెంకట రమణ; స్టోరి-స్క్రీన్ ప్లే-డైలాగ్స్ః డైరక్షన్ః సీరపు రవికుమార్.
Post a Comment