Actor Arbaaz Khan roped in for Ganga Entertainments - Ashwin Babu film

 గంగా ఎంటర్టైన్మంట్స్ ప్రొడక్షన్ 1 లో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ముఖ్య పాత్ర!



యువ నటుడు అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోకి తాజాగా బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ అడుగు పెట్టారు.


మెగాస్టార్ చిరంజీవి 'జై చిరంజీవ' చిత్రం తో టాలీవుడ్ కి పరిచయమయిన ఈ పాపులర్ బాలీవుడ్ నటుడు ఇటీవల మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ 'బిగ్ బ్రదర్' చిత్రంలో కూడా నటించారు.


చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ ఒక తెలుగు చిత్రంలో నటించడం ఆయనకి అమితమైన సంతోషాన్నివ్వగా, అది గంగా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ 1 లో తెరకెక్కుతున్న ఒక డిఫరెంట్ కథలోని ముఖ్య పాత్రతో జరగడం ఇంకా ఆనందంగా ఉందంటున్నారు.


ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ''అశ్విన్ బాబు హీరోగా ఒక వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ మొదటి నిర్మాణంలోనే అర్బాజ్ ఖాన్ గారితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. కొత్త కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది. అర్బాజ్ గారి పాత్ర అద్భుతంగా అంటుంది. ఈ రోజు నుంచి జరగనున్న కొత్త షెడ్యూల్ తో ఆయన సెట్స్ లోకి అడుగు పెడతారు. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో సినిమా చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం'' అని అన్నారు. 


అశ్విన్ బాబు సరసన దిగంగనా సూర్యవంశీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో 'హైపర్' ఆది, తమిళ నటుడు సాయి ధీన ప్రధాన పాత్రలో నటించనున్నారు.


ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్

ప్రొడక్షన్ డిజైనర్ : సాహి సురేష్ (కార్తికేయ 2 ఫేమ్)

మ్యూజిక్ డైరెక్టర్ : వికాస్ బడిస

డీవోపీ : దాశరథి శివేంద్ర (హనుమాన్, మంగళవారం ఫేమ్)

పి ఆర్ ఓ :నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా )

నిర్మాత : మహేశ్వర్ రెడ్డి మూలి

దర్శకత్వం : అప్సర్

Post a Comment

Previous Post Next Post