సుహాస్, సంకీర్తన విపిన్ హీరో హీరోయిన్లుగా దిల్ రాజు ప్రొడక్షన్స్ నెం.4 చిత్రం ప్రారంభం
విలక్షణమైన పాత్రలతో నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న ‘కలర్ ఫొటో’ ఫేమ్ సుహాస్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.4 చిత్రంగా సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. సంకీర్తన విపిన్ కథానాయిక. ప్రముఖ నిర్మాత శిరీష్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రశాంత్ నీల్ క్లాప్ కొట్టారు. అనీల్ రావిపూడి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, బలగం వేణు గౌరవ దర్శకత్వం వహించారు. దిల్ రాజు, శిరీష్ స్క్రిప్ట్‌ను అందించారు.
బలగం వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఆకాశం దాటి వస్తావా రెండో చిత్రంగా రూపొందుతోంది. రీసెంట్‌గా ఆశిష్‌తో మూడో సినిమాను స్టార్ట్ చేశారు. ఇప్పుడు సుహాస్ కథానాయకుడిగా నాలుగో సినిమా ప్రారంభమైంది. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ దిల్ రాజు ప్రొడక్షన్స్ వైవిధ్యమైన సినిమాలతో దూసుకెళ్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు.
నటీనటులు:
సుహాస్, సంకీర్తన విపిన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, గోపరాజు మరణ, మురళీ శర్మ, రఘుబాబు, పృథ్వీ, శివన్నారాయణ, రూప లక్ష్మి, విజయ లక్ష్మి తదితరులు.
సాంకేతిక వర్గం:
దర్శకత్వం - సందీప్ రెడ్డి బండ్ల, సమర్పణ - శిరీష్, బ్యానర్ - దిల్ రాజు ప్రొడక్షన్స్, నిర్మాతలు - హర్షిత్ రెడ్డి, హన్షిత, సినిమాటోగ్రఫీ - సాయిశ్రీరామ్, సంగీతం - విజయ్ బుల్గానిన్, ఆర్ట్ - రామ్ అరసవిల్లి, పి.ఆర్.ఒ - వంశీ కాకా