FNCC Team Felicitated Telangana Speaker Gaddam Prasad Kumar

 తెలంగాణ శాసనసభ స్పీకర్ గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ గారికి ఫిలింనగర్ కల్చరల్ కమిటీ(FNCC) సభ్యులు చేసిన సన్మానం



ఈ గౌరవప్రద సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఫిలింనగర్ కల్చరల్ కమిటీ(FNCC) సభ్యులు ప్రెసిడెంట్ ఆదిశేష గిరి గారు, హానరబుల్ సెక్రటరీ ముళ్ళపూడి మోహన్ గారు, జాయింట్ సెక్రటరీ పెద్దిరాజు గారు, ఎక్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ గారు, మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. FNCC ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ సమక్షంలో పుష్పగుచ్చము ఇచ్చి శాలువా కప్పి సన్మానం చేయడం జరిగింది.


ప్రొడ్యూసర్ మరియు FNCC సెక్రటరీ మోహన్ గారు మాట్లాడుతూ గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసనసభ స్పీకర్ గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి ప్రత్యేకంగా నా తరఫున మరియు మా కమిటీ సభ్యులు తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అన్నారు.


తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు మాట్లాడుతూ : నన్ను ఇలా ఈ సన్మానానికి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది.  FNCC చాలా అభివృద్ధి చెందింది. ఇక్కడికి రావడం నా స్నేహితుల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలా FNCC ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. FNCC కి నా వంతు కావాల్సిన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ వుంటాయని తెలియచేశా. ఇలా నన్ను ఆహ్వానించి సన్మానించినందుకు FNCC కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నారు.

తెలంగాణ శాసనసభ స్పీకర్ గా ఎన్నికైనందుకుగాను గడ్డం ప్రసాద్ కుమార్ గారికి చేసిన సన్మానం విజయవంతమైనది.

Post a Comment

Previous Post Next Post