Home » » Eagle x Dhamaka Celebrations Held Grandly

Eagle x Dhamaka Celebrations Held Grandly

ధమాకా విజయం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఈగల్ లో ప్రేక్షకులు కొత్త రవితేజని చూస్తారు: ‘ఈగల్‌ x ధమాకా’ సెలబ్రేషన్స్‌ లో మాస్ మహారాజా రవితేజమాస్ మహారాజా రవితేజ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ‘ధమాకా’.  శ్రీలీల హీరోయిన్ గా  త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఏడాది పూర్తి చేసుకుంది. మరోవైపు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రవితేజ తాజా చిత్రం ‘ఈగల్‌’ 2024 సంక్రాంతి కానుకగా జనవరి13  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటివలే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో 'ఈగల్' పై అంచనాలని మరోస్థాయికి తీసుకెళ్ళింది. ఈ సందర్భంగా ‘ఈగల్‌ x ధమాకా’ సెలబ్రేషన్స్‌ ని గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకలో ‘ధమాకా’ టీమ్‌కు మెమెంటోలు అందజేశారు.


‘ఈగల్‌ x ధమాకా’ సెలబ్రేషన్స్‌ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. నిర్మాత విశ్వప్రసాద్ గారికి అభినందనలు. ధమాకా నిన్నో మొన్నో విడుదలైనట్లుంది. ఏడాది అయిందంటే నమ్మబుద్ధి కావట్లేదు. సంగీత దర్శకుడు భీమ్స్‌ ఇచ్చిన పాటలకు.. తనకి మంచి గుర్తింపు వస్తుందని సినిమా విడుదలకాక ముందే బలంగా నమ్మాను. అదే నిజమైంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మనకున్న సంగీత దర్శకుకుల్లో తనుకూడా ఒక బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్.  మళ్లీ మేం కలిసి పనిచేయబోతున్నాం. శ్రీలీల పెద్ద హీరోయిన్ అవుతుందని చెప్పాను. ఊహించినట్లే శ్రీలీల హీరోయిన్‌గా అద్భుతంగా రాణిస్తోంది. ఆది, మంగ్లీ, మౌనిక టీం అందరికి పేరుపేరునా అభినందనలు.

‘ఈగల్‌’ సినిమా విషయానికి వస్తే,.. కార్తిక్ ని కెమరామ్యాన్ గా చూశాం. ఇప్పుడు దర్శకుడిగా చూడబోతున్నాం. ఈ సినిమాతో కార్తిక్ కి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని నా బలమైన నమ్మకం. ఒక్కటి మాత్రం చెప్పగలను.. ఇందులో ప్రేక్షకులకు ఒక కొత్త రవితేజను చూపించబోతున్నాడు. అది నాకు చాలా తృప్తిని ఇచ్చింది. ఈ సినిమాలో కొత్త కావ్యా థాపర్‌ కనిపిస్తుంది. ఆ పాత్ర నాకు చాలా నచ్చింది. దేవ్ జాంద్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. తను గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అవసరాల శ్రీనివాస్ చాలా సెన్సిబుల్ పర్సన్. విశ్వగారి ఆల్ ది వెరీ బెస్ట్. మా ప్రయాణం కొనసాగుతుంది'' అన్నారు.


దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని మాట్లాడుతూ.. ఏడాది రెండు వైవిధ్యమైన చిత్రాలు చేశాను. ఒకటి ధమాకా.. రెండు ఈగల్. ఇద్దరు భిన్నమైన నటులతో పని చేసినట్లుగా అనిపిస్తోంది. ధమాకా నాకు డిఫరెంట్ సినిమా. అంతకుముందు అలాంటి సినిమా చేయలేదు. ఇప్పుడు దానికి భిన్నమైన చిత్రం ‘ఈగల్’ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన రవితేజ గారికి ధన్యవాదాలు. ఈ రెండు సినిమాలకి నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత విశ్వ ప్రసాద్ గారికి, వివేక్ గారికి థాంక్స్. ఈగల్ అన్ని కమర్షియల్ అంశాలు వున్న చాలా మంచి చిత్రం. ఖచ్చితంగా సంక్రాంతికి చూడండి’’ అని కోరారు.


నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. గత ఏడాదిని బ్లాక్ బస్టర్ తో ఎండ్ చేశాం. నెక్స్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ తో మొదలుపెడతాం. ఈగల్ మంచి ఎంటర్ టైనర్. రవితేజ గారి బిగ్ మాస్ అవతార్ తో చాలా అద్భుతమైన యాక్షన్ వుంటుంది. ఖచ్చితంగా పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం వుంది’’ అన్నారు


కావ్య థాపర్ మాట్లాడుతూ.. ఈగల్ ట్రైలర్ కి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఏడాది పూర్తి చేసుకున్న ధమాకా టీం అందరికీ అభినందనలు. రవితేజ గారితో కలసి నటించడం గౌరవంగా వుంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ పాత్రలో అవకాశం ఇచ్చిన దర్శకుడు కార్తిక్ కి ధన్యవాదాలు. నన్ను నమ్మి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన నిర్మాత విశ్వప్రసాద్ గారికి ధన్యవాదాలు’’ తెలిపారు.


శ్రీలీల మాట్లాడుతూ.. ధమాకా తో ఏడాది అంతా చాలా అద్భుతంగా ప్రయాణం సాగింది. ‘పెళ్లిసందD’ విడుదలకు ముందే నాకు ‘ధమాకా’లో నటించే అవకాశం వచ్చింది. నాపై నమ్మకం ఉంచిన రవితేజ గారికి ధన్యవాదాలు. నిర్మాతలు విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు ఎంతగానో సపోర్ట్ చేశారు. డైరెక్టర్ త్రినాథ్ గారు, రచయిత ప్రసన్న గారు అందరికీ ధన్యవాదాలు. ఇంత పెద్ద  విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ తెలిపారు.


శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ.. ధమాకా లానే ఈగల్ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంటుదనే నమ్మకం వుంది. రవితేజ గారి డ్యాన్స్ చూస్తున్నపుడు ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది.   రవితేజ గారి యాక్టింగ్ కి ఫ్యాన్ ని. ఈగల్ సినిమా షూటింగ్ లో ఆయన్ని కలిసిన తర్వాత ఆయన వ్యక్తిత్వానికి కూడా ఫ్యాన్ అయిపోయాను. ఆనందంగా పని చేస్తూ అందరినీ ఆనందంగా చూసుకునే మనిషి  రవితేజ గారు. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన విశ్వప్రసాద్ గారికి ధన్యవాదాలు. కార్తిక్ తో వర్క్ చేయడం చాలా అద్భుతమైన అనుభూతి’’ అన్నారు.


హైపర్ ఆది మాట్లాడుతూ.. ఈ వేడుక చూస్తుంటే మొన్ననే ధమాకా విడుదలై ఇప్పుడు సక్సెస్ మీట్ జరిగినట్లు అనిపిస్తోంది.  రవితేజ గారికి ఆయన స్టయిల్ లో ఎంటర్ టైన్ మెంట్ పడితే ప్రేక్షకులు వందకోట్లతో ఆశీర్వదించారు. రవితేజ గారు ఆయన్ని ఎప్పటికప్పుడు కొత్తగా ప్రూఫ్ చేసుకోవడానికి భిన్నమైన కథలు చేస్తుంటారు. రవితేజ గారి చేసిన ప్రయోగాలు వలనే హరీష్ శంకర్, బాబీ, మలినేని గోపీచంద్ లాంటి డైనమిక్ డైరెక్టర్స్ వచ్చారు. ఆయన ఎంతోమంది ప్రతిభావంతులని వెలుగులోకి తెచ్చారు. రవితేజ గారు ఒక తరానికి వినోదం పంచిన హీరో మాత్రమే కాదు ఒక తరానికి స్ఫూర్తిని ఇచ్చిన వ్యక్తి. అలాంటి రవితేజ గారితో ధమాకా సినిమాలో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ‘ఈగల్’ చిత్రం కూడా చాలా పెద్ద విజయాన్ని సాధిస్తుంది’’ అన్నారు. ఈ వేడుకలో ధమాకా, ఈగల్ చిత్రాల యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.


Share this article :