కంప్లీట్ విలేజ్ రూరల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన అన్వేషి ప్రేక్షకులను మెప్పిస్తుంది: హీరో విజయ్ ధరణ్
విజయ్ ధరణ్, సిమ్రాన్ గుప్తా, అనన్యా నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటించిన హారర్ అండ్ కామెడీ ఫిల్మ్ ‘అన్వేషి’. అరుణ శ్రీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వీజే ఖన్నా దర్శకత్వంలో టి.గణపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ చైతన్ భరద్వాజ్ అందించగా.. సినిమాటోగ్రఫర్‌గా కేకే రావు వ్యవహరించారు. ఎడిటర్‌గా కార్తీక శ్రీనివాస పనిచేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీన నవంబర్ 17న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హీరో విజయ్ ధరణ్ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
"నా ఫస్ట్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది. పెద్దగా గుర్తింపురాలేదు. రెండు మూడు సినిమాల్లో హీరోగా నటించినా.. అవి రిలీజ్ అవ్వలేదు. డైరెక్టర్ విజయ్ ఖన్నా గారు ఆడిషన్స్‌కు పిలవడంతో నా అన్వేషి మూవీ జర్నీ స్టార్ట్ అయింది. కథ విన్న తరువాత బెస్ట్ ఫిల్మ్ అవుతుందని అనిపించింది. కథలో కొత్త ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇంతకుముందు చూసిన సినిమాల్లాగా అనిపించలేదు. లవ్ స్టోరీతో స్టార్ట్ అవుతుంది సినిమా. హర్రర్ మిక్స్ ఉంటుంది. లవ్ థ్రిల్లర్‌గా అని చెప్పొచ్చు.
కథలోకి వెళితే.. మారేడుకోన గ్రామంలో దారి సమస్య ఉంటుంది. దీనికి మెయిన్ కారణం.. ఆసుపత్రిలో అనుమానాస్పద ఘటనలు జరుగుతుంటాయి. ఎందుకు ఇవి జరుగుతుంటాయి. అక్కడికి డిటెక్టివ్ అవుదామనుకున్న కుర్రాడు ఎలా వచ్చాడు..? ఆ సమస్యలను ఎలా పరిష్కరించాడు..? అనేది కథ. నన్ను ఫస్ట్ టైమ్ పిలిచి హీరోగా అవకాశం ఇచ్చారు. మా సినిమాకు లక్కీగా థియేటర్లు దొరికాయి.
ముందుగా సినిమాలో వేరే హీరోయిన్స్‌ను అనుకున్నారు. తరువాత అనన్య నాగళ్ల కథ విని ఒకే చేసింది. పాత్రలో జీవించి.. చాలా బాగా నటించింది. తెలుగు అమ్మాయి కావాలి.. తెలుగు మాట్లాడే అమ్మాయి ఉండాలని అనన్య నాగళ్లను సెలెక్ట్ చేశారు. సినిమా నా పెయిర్ సిమ్రాన్ గుప్తాతో ఉంటుంది. అయితే కథ అంతా అమ్మాయి చూట్టే ఉంటుంది. ఆడియన్స్ స్మార్ట్ అయిపోయారు. అందుకే క్లూ గెస్ చేయకుండా పోస్టర్ కట్ చేశారు. అనన్యది చాలా ఇంపార్టెంట్ రోల్.
ఎంటర్‌టైన్‌మెంట్ పాత్రను నాగిణి గారు చేశారు. నువ్వే నువ్వే మూవీలో తరుణ్-సునీల్ తరహాలో అలాంటి కాంబినేషన్ రిపీట్ అయిందని డైరెక్టర్ గారు చెప్పారు. ఆయన ఆ మాట చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. నాగి కామెడీ చాలా బాగుంటుంది. ఓ ఆత్మ వల్ల జరిగిన సంఘటలన కారణంగా సినిమాలో ఇన్వెస్టిగేషన్ ప్రారంభం అవుతుంది. కంప్లీట్‌గా ఫిక్షనల్‌గా ఉంటుంది.
నాది కొత్త క్యారెక్టర్. అప్‌కమింగ్ యాక్టర్‌కు ఈ పాత్ర కొంచెం కష్టమే. కానీ నేను థ్రియేట్రికల్‌గా ట్రైన్ కావడంతో ఇబ్బంది కాలేదు. చాలా షోలు చేశా. డైరెక్టర్ గారు చెప్పింది బాగా అర్థమయ్యేది. డైరెక్టర్‌ను బట్టే ఒక యాక్టర్ గానీ.. టెక్నీషియన్ గానీ బయటకు వస్తారు. డైరెక్టర్ చెప్పే విధానం బాగుండడంతో చాలా ఈజీగా చేశాం. సినిమా మేము అనుకున్నదానికంటే చాలా బాగా వచ్చింది. కంప్లీట్‌గా విలేజ్ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. మిస్టరీ అంతా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కొంతమందికి షోలు వేసి చూపించాం. అందరూ కథ చాలా ఫ్రెష్‌గా ఉంది.. ప్రతి క్యారెక్టర్ కొత్తగా ఉందని చెబుతున్నారు. ఎక్కడా బోర్ కొట్టేలేదు.. చివరి వరకు ఆ టెన్స్ మెయింటెన్ అయిందన్నారు. సినిమా ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. రేపు ఆడియన్స్ కూడా ఇదే మాట చెబుతారు.
ఈ సినిమా తరువాత నా కెరీర్ కచ్చితంగా బాగుంటుంది. ఇంతకుముందు మాదిరి మళ్లీ ఆఫీస్‌లా చుట్టు అవకాశాల కోసం తిరిగాల్సిన ఇది లేదు. ట్రైలర్ తరువాతే నాకు కాల్స్ వచ్చాయి. తమిళ్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది. కన్నడ నుంచి ఒక డైరెక్టర్ వచ్చారు. బైలింగ్వల్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. కొత్తవాళ్ల కోసం చూస్తున్నారు. నాకు లైఫ్‌లో ఫస్ట్ టైమ్ కాల్స్ వచ్చాయి. ఏ నటుడికి అయినా ఇంకా బెటర్‌గా చేయాలని అనిపిస్తుంటుంది. డైరెక్టర్ బాగా ఉందని చెప్పినా.. నటుడిగా ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. ఆడియన్స్‌కు ఎలా రీచ్ అవుతుందని అనిపిస్తుంటుంది. నటుడికి ఒక్కోపాత్ర ఛాలెంజింగ్ ఉంటుంది. సినిమాలో తాగుబోతు సీన్ ఒకటి ఉంటుంది. చాలా బాగా వచ్చింది.
నటుడిగా ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ వెళ్లాలి. తమిళ్‌లో విలన్‌గా అడిగారు. ఇంకా మాట్లాడుతున్నాం. రాజేంద్రప్రసాద్ సినిమాలో నాకు ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను. అది చాలా మంచి సినిమా అవుతుంది. అందులో రాజేంద్రప్రసాద్ హీరో. నాది మంచి పాత్ర. హీరోగా చేయాలనే లేదు. ఒక నటుడిగా ఏ అవకాశం వచ్చినా నటిస్తా.
ఈ సినిమాకు లక్కీగా మాకు మంచి ప్రొడ్యూసర్ దొరికారు. ఆయనకు ఇతర బిజినెస్‌లు ఉన్నా.. ఇక ఎక్కువగా నిర్మాణ రంగంలోనే ఉండాలని ఫ్యామిలీ అంతా ప్రొడక్షన్‌లోకే వచ్చేశారు. సరదాగా చేద్దామని కాకుండా.. చాలా మంచి సినిమాలు తీస్తున్నారు. తరువాత మరో మూడు మంచి సినిమాలు ఉన్నాయి.
సినిమా ఆడకపోతే గుండు కొట్టించుకుంటా అని చెప్పా. నాకు సినిమాపై నమ్మకంతో ఉన్నా. కథ విన్నప్పుడే బెస్ట్ వస్తుందని తెలుసు. ప్రొడక్షన్ వాల్యూస్ పెరగడం.. టెక్నీషియన్స్ పెద్ద పెద్ద వాళ్లు చేరడంతో సినిమా హిట్ అవుతుందని నమ్మకం ఏర్పడింది. నేను నిజాయితీగానే చెప్పా. ఇదే లాస్ట్ సినిమా. ఇండస్ట్రీ వదిలేసి పోదామని అనుకున్నా. ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రయత్నంగా చేశా. లక్కీగా సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా నిజంగా ఎవరైనా బాగోలేదంటే నేను గుండు గీయించుకోవడానికి రెడీగా ఉన్నా. డైరెక్ట్‌గా ఫిల్మిచాంబర్ వద్ద గుండు గీయించుకుని వీడియో పెడతా. మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ చిన్న హీరో.. పెద్ద హీరో అని కాకుండా క్వాలిటీతో చేశారు. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ఈ ప్రొడక్షన్‌లోనే ఇంకో సినిమా చేయాలని అనుకుంటున్నాం. మా డైరెక్టర్ గారు ఒక కథ అనుకున్నాం. అన్వేషి-2 కూడా రాబోతుంది. అది ఇంకా నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. అన్వేషి అంటే ఫైండింగ్ ట్రూత్.." అని చెప్పారు.