Home » » Tiger Nageswara Rao Pre Release Event Held Grandly

Tiger Nageswara Rao Pre Release Event Held Grandly

‘టైగర్ నాగేశ్వరరావు’ యాక్షన్, ఎమోషన్, థ్రిల్.. అన్ని ఎలిమెంట్స్ తో ప్రేక్షకులని గట్టిగా అలరిస్తుంది: గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ



‘టైగర్ నాగేశ్వరరావు’ సరికొత్త రికార్డులుని క్రియేట్ చేస్తుంది: కేంద్రమంత్రి నంద్ గోపాల్ గుప్తా


టైగర్ కి ఎదురులేదు. దసరా టైగర్ నాగేశ్వరరావుదే: విజయేంద్రప్రసాద్


అక్టోబర్ 20.. టైగర్ నాగేశ్వర్ రావు బ్లాక్ బస్టర్:  హరీష్ శంకర్


టైగర్ ట్రైలర్ చూశాక థియేటర్లో చూడాలనే ఎక్సయిమెంట్ పెరిగిపోతుంది: గోపీచంద్ మలినేని


మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్. గ్రిప్పింగ్ టీజర్, మ్యాసివ్ ట్రైలర్, చార్ట్‌బస్టర్ పాటలతో టైగర్ ఇప్పటికే నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. అక్టోబర్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. కేంద్రమంత్రి నంద్ గోపాల్ గుప్తా, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్, దర్శకులు హరీష్ శంకర్, మలినేని గోపీచంద్, బివీఎస్ రవి, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, నవీన్ యర్నేని, వివేక్, సుధాకర్ చెరుకూరి, మిర్యాల రవీందర్, నాగవంశీ పాల్గొన్న ఈ ఈవెంట్ వేడుకగా జరిగింది.


ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. మా గురువు గారు విజయేంద్రప్రసాద్ గారికి, కేంద్రమంత్రి నంద్ గోపాల్ గుప్తా గారికి, ఈ వేడుకు విచ్చేసిన నా తమ్ముళ్ళు లాంటి దర్శకులు హరీష్, రవి, గోపికి, నిర్మాతలకు, నా అభిమానులకు ధన్యవాదాలు. ఈ సినిమా ప్రతి బ్లాక్ అద్భుతంగా వచ్చిందంటే దానికి కారణం మా డీవోపీ మధి. మా యాక్షన్ కొరియోగ్రఫర్స్ పీటర్ హెయిన్స్, రామ్ లక్ష్మణ్ చాలా బ్రిలియంట్ యాక్షన్ ని డిజైన్ చేశారు. రియల్ లోకేషన్స్ రియల్ యాక్షన్. ఈ సినిమా యాక్షన్ ఎమోషన్ ఇంత రియల్ గా రావడానికి మరో కారణం రామ్ లక్ష్మణ్ కూడా ఆ ప్రాంతం వారే. టైగర్ గురించి బాగా తెలిసిన వాళ్ళు. వంశీ ఈ కథ చెప్పినపుడు చాలా ఎక్సయిట్ అయ్యాను. ఈ సినిమా మిమ్మల్ని గట్టిగా అలరిస్తుందని నమ్ముతున్నాను. రేణు దేశాయ్ గారు చాలా రోజుల తర్వాత కమ్ బ్యాక్ ఇచ్చారు. చాలా అద్భుతంగా ఆ పాత్రకు మ్యాచ్ చేశారు. శ్రీకాంత్ విస్సా అద్భుతమైన డైలాగ్స్ రాశాడు. చాలా ఎంజాయ్ చేస్తారు. ఎమోషన్ ఫీల్ అవుతారు. అనుకృతి కీలకమైన పాత్ర చేసింది. నూపూర్, గాయత్రి బ్యూటీఫుల్ హీరోయిన్స్. క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. అభిషేక్ అగర్వాల్‌ ఎక్కడా రాజీపడకుండా తీశారు. సినిమా చాలా భారీ వుంటుంది. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలి. తనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. జీవి ప్రకాష్ మ్యూజిక్ కి చాలా థ్రిల్ ఫీలౌతారు. సౌండ్ థియేటర్ లో ఎలా వుంటుందో చూడటానికి ఎదురుచూస్తున్నా. వంశీ నుంచి ఇలాంటి కన్విక్సన్ నేను ఊహించలేదు. అంత అద్భుతంగా చేశాడు. అది ప్రేక్షకులు కూడా చూస్తారు. వంశీ గురించి రిలీజ్ తర్వాత గట్టిగా మాట్లాడతా. ఈ సినిమా అక్టోబర్ 20న మీ అందరినీ అలరించడానికి వస్తుంది. ఎమోషన్.. థ్రిల్..యాక్షన్ అన్ని ఎమోషన్స్ ఇందులో వున్నాయి. అలాగే మా బాలయ్య బాబు సినిమా భగవంత్ కేసరి కూడా విడుదలౌతుంది. అలాగే విజయ్ సినిమా కూడా వస్తుంది.. అన్నీ సినిమాలు సూపర్ హిట్లు కావాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు.


అభిషేక్ అగర్వాల్‌ మాట్లాడుతూ..  ‘టైగర్ నాగేశ్వరరావు’ జర్నీ పూర్తి కావడంపై నాకు డిఫరెంట్ ఫీలింగ్ వుంది. వంశీతో నాలుగేళ్ల జర్నీ. మమ్మల్ని నమ్మిన రవితేజ గారికి ధన్యవాదాలు. రవితేజ గారి సపోర్ట్ కి చాలా థాంక్స్. అలాగే వివేక్ గారికి ధన్యవాదాలు. టీం అందరికీ పేరుపేరునా థాంక్స్’ తెలిపారు.


కేంద్రమంత్రి నంద్ గోపాల్ గుప్తా మాట్లాడుతూ.. ఈ వేడుకలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. ‘టైగర్ నాగేశ్వరరావు’ సౌత్ పరిశ్రమ నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం. రవితేజ గారి నటనని ఇష్టపడే ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా వున్నారు. రవితేజ గారికి, అభిషేక్ అగర్వాల్ గారికి అభినందనలు. అభిషేక్ అగర్వాల్ ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేశారు. అనుపమ్ ఖేర్ గారు కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడం ఆనందంగా వుంది. ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందనే నమ్మకం వుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని, టీం అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.  


మయాంక్ సింఘానియా మాట్లాడుతూ.. ‘టైగర్ నాగేశ్వరరావు’ లాంగ్ ఎమోషనల్ జర్నీ. అభిషేక్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. వంశీ అద్భుతంగా తీశారు రవితేజ గారు తప్పితే టైగర్ పాత్రలో మరొకరిని ఊహించలేం. టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’’ తెలిపారు


దర్శకుడు వంశీ మాట్లాడుతూ.. అభిషేక్ అగర్వాల్‌ గారికి ముందుకు థాంక్స్ చెప్పాలి. ఈ  ప్రాజెక్ట్ ని చాలా బలంగా నమ్మారు. రవితేజ గారు కొత్త ప్రతిభని, దర్శకులని ప్రోత్సహిస్తారని చాలా మంది చెప్తారు. కానీ ఇందులో మరో విశేషం ఏమిటంటే ఆయన సక్సెస్ ఫెయిల్యుర్ ని చూడరు. ఆయన ఈ సినిమా కోసం నన్ను బలంగా నమ్మారు. ఇది నాకు చాలా గొప్ప మూమెంట్. ఇది రవితేజ గారి వలనే సాధ్య పడింది. విజయేంద్ర ప్రసాద్ కాల్ చేసిన ప్రత్యేకంగా ప్రశసించడం ఆనందంగా వుంది. నుపూర్, గాయత్రి, రేణు గా చక్కని పాత్రలు పోషించారు. మధీ, జీవి ప్రకాష్, అవినాష్ బ్రిలియంట్ వర్క్ చేశారు. ఇందులో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. దాదాపు నాలుగేళ్ల ప్రయాణం. ఏ మాత్రం ఒత్తిడి లేదు. ఎందుకంటే సినిమా చూశాను. మీరు అనుకునే దాని కంటే మించి వుంటుంది. మీరు చూసిన ప్రతి సెకండ్ బయటికి వచ్చి మళ్ళీ చూడాలని అనుకుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ‘టైగర్ నాగేశ్వరరావు’ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది’’అన్నారు.


హరీష్ శంకర్ మాట్లాడుతూ...రవితేజ గారి సినిమా అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. నా జీవితంలో మాత్రం అమ్మా నాన్న రవితేజ. ప్రతిభని గుర్తించడంలో రవితేజ ముందుంటారు. నా గురించి నా కంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి రవితేజ గారు. వంశీ చాలా గ్రాండ్ గా సినిమా తీశాడు. అభిషేక్ అగర్వాల్‌ వరుస విజయాలు సాధిస్తున్నారు. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. రవితేజ.. పరిగెత్తే రైలు. ఆ రైలులో నాకంటూ కొన్ని బోగీలు ఉన్నందుకు ఆనందంగా వుంది. అక్టోబర్ 20 .. టైగర్ నాగేశ్వర్ రావు బ్లాక్ బస్టర్’’ అన్నారు.  


గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. వంశీకి అడ్వాన్స్ కంగ్రాట్స్. బ్లాక్ బస్టర్ కొట్టడం గ్యారెంటీ. నా మొదటి సినిమా డాన్ శీను తో డైరెక్టర్ అయి ఇండస్ట్రీలో వుండటాని కారణం రవితేజ గారు. ఈ రోజు ఇండస్ట్రీలో వుండే దాదాపు మాస్ డైరెక్టర్స్ ఆక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. నెక్స్ట్ వంశీ రాబోతున్నాడు. రవితేజ గారితో వుంటే ఆ ఎనర్జీ వేరు. టైగర్ ట్రైలర్ చూసినప్పటి నుంచి సినిమాని థియేటర్లో చూడాలనే ఎక్సయిమెంట్ పెరిగిపోతుంది. చాలా అద్భుతంగా టైగర్ ని ప్రజంట్ చేశారు. అన్నీ ఎక్స్ ట్రార్డినరీ గా వున్నాయి. ఈ సినిమా ద్వారా ఒరిజినల్ రౌడీ రాధోడ్ ని హిందీ ప్రేక్షకులు చూస్తారు.  ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను.


విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ చూశాను. ప్రతి ఫ్రేం నన్ను ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళింది. నాగేశ్వరరావు చనిపోయాడు టైగర్ పుట్టాడు అనే మాట నన్ను చాలా కదిలించిది. దర్శకుడు వంశీకి కాల్ చేసి అభినందించాను. వంశీకి చాలా మంచి  భవిష్యత్ వుంటుంది. రవితేజ గారికి ఒక విన్నపం. విక్రమార్కుడు సినిమాని హిందీ తమిళం కన్నడ లో చేశారు. కానీ రవితేజ గారిని ఎవరూ మ్యాచ్ చేయలేదు. రవితేజ గారు కేవలం తెలుగు సినిమాకే పరిమితం కాకూడదు. భారతదేశ కీర్తి పతాకాలు ఎగరేయాలని కోరుకుంటున్నాను. అభిషేక్ అగర్వాల్ కి ఇది బంగారు కాలం. వస్తున్నది దసరా. దుర్గమ్మ తల్లి ముందు ఎవరూ నిలబడలేరు. ఆ తల్లి వాహనం టైగర్ ముందు కూడా ఎవడూ నిలబడలేదు. దసరా మీదే’’ అన్నారు.

 

బీవీఎస్ రవి మాట్లాడుతూ.. వంశీ చాలా ప్రతిభావంతుండు. మాస్ మహారాజా చేయిపడితే మామూలుగా వుండదు. ఈ సినిమాతో వంశీ కూడా పెద్ద దర్శకుడు అవుతాడు. రవితేజ గారు ఎన్నో ఘన విజయాలు సాధించారు. ఆయన వ్యక్తిగా కూడా చాలా మందికి స్ఫూర్తి. చాలా నిజాయితీ గల వ్యక్తి. టైగర్ టీం అందరికీ ఆల్ థ్ బెస్ట్. అభిషేక్  గారి విజయాలు కొనసాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు,  


నాగవంశీ మాట్లాడుతూ.. రవితేజ గారు పీపుల్ మీడియా కి ధమాకా, మైత్రీ మూవీ మేకర్స్ వాల్తేరు వీరయ్యా.. ఇలా అందరికీ సినిమాలు చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ నాతో సినిమా చేయాలని కోరుకుంటూ టైగర్ కి ఆల్ ది బెస్ట్’’ తెలిపారు  


టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. రవితేజ గారి ధమాకా తో మా ప్రయాణం మొదలుపెట్టాం. ఈగల్ ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నాను. టైగర్ కోసం వంశీ చాలా హార్డ్ వర్క్ చేశారు. అభిషేక్ అగర్వాల్ కి ఇది మరో పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు.


వివేక్ మాట్లాడుతూ.. దసరాకి టైగర్ వేటాడబోతుంది. ఈగల్ పండక్కి వేటాడుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించి అభిషేక్ అగర్వాల్  గారికి మంచి పేరు ప్రఖ్యాతలని తీసుకొస్తుందని కోరుకుంటున్నాను.


మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. నాకు ఈ సినిమా గురించి మూడేళ్ళ క్రితమే తెలుసు. రేణు దేశాయ్ గారిని మా సినిమాలో ఓ పాత్రకు తీసుకోవాలని భావించిననపుడు ఈ కథ గురించి అందులో పాత్రల గురించి చెప్పారు. ఈ కథే నటీనటులుని ఎంపిక చేసుకుంది. రవితేజ గారు ఎన్నో విజయాలు ఇచ్చారు. ఈ సినిమా తన కెరీర్ మరపురాని సినిమాగా నిలుస్తుంది. అభిషేక్ అగర్వాల్  గారికి టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు


రేణు దేశాయ్ మాట్లాడుతూ.. మీ అందరికీ ప్రేమకి కృతజ్ఞతలు. ఈ సినిమా అద్భుతమైన పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలకు చాలా ఇంటర్వ్యూస్ లో థాంక్స్ చెప్పాను. ఈ వేదిక పై నుంచి రవితేజ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.  2019 నుంచి ఈ సినిమాలో భాగమయ్యాను. కోవిడ్ వలన కొంత ఆలస్యమైయింది. తర్వాత వంశీ గారు కాల్ చేసి సినిమా మొదలౌతుందని చెప్పారు. ఈ సినిమాలో నేను వున్నానా అని వంశీని అడిగాను. ఎందుకంటే రవితేజ గారు బిగ్ స్టార్. ఆయన నా పాత్రని రిప్లేస్ చేయొచ్చు. నాకంటే సినియర్, గొప్ప నటిని తీసుకునే ఆప్షన్ ఆయనకి వుంది. కానీ అలా చేయలేదు.  రవితేజ గారు తీసుకున్న నిర్ణయం నాకు ఎంతో ముఖ్యం. ఈ సందర్భంగా ఆయనకి థాంక్స్ చెబుతున్నాను.  సినిమాని థియేటర్ లో చూడండి. తప్పకుండా మిమ్మల్ని గొప్పగా అలరిస్తుంది’’ అన్నారు.


నూపుర్ సనన్ మాట్లాడుతూ.. జై మాస్ మహారాజా. రవితేజ గారికి, దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమాలో సార పాత్రని పోషించాను. సినిమా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ ఖచ్చితంగా అలరిస్తుంది'' అన్నారు,


గాయత్రి భరద్వాజ్ మాట్లాడుతూ.. రవితేజ గారి సినిమాలో పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. దర్శక నిర్మాతలు కృతజ్ఞతలు. ఈ వేడుకకు వచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు' తెలిపారు. ఈ వేడుకలో సుదీవ్ నాయర్, అనుకీర్తి, అడకులం నరేన్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.




Share this article :