Rathi Nirvedam Re Releasing On October 11

 మరోసారి సందడి చేయడానికి సిద్ధమవుతున్న ‘రతి నిర్వేదం’



యధార్థ సంఘటనలతో కూడుకున్న పేరొందిన నవల ‘రతినిర్వేదం’ 1978లో సినిమా తెరకెక్కి విజయవంతమైంది. అదే టైటిల్‌తో 2011లో తెరకెక్కించారు దర్శకుడు టి.కె.రాజీవ్‌ కుమార్‌. శ్వేతా మీనన్‌ కీలక పాత్ర పోషించారు. శ్రీజిత్‌ విజయ్‌ కీలక పాత్రధారుడు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ విడుదలై సంచలన విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రం మరోసారి ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 11న ఈ చిత్రాన్ని రీరిలీజ్‌ చేయనున్నారు మేకర్స్‌. 

శ్వేతా మీనన్‌, శ్రీజిత్‌ విజయ్‌ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రచయిత ఫ పి.పద్మరాజన్‌, సంగీతం: ఎం.జయచంద్రన్‌; సినిమాటోగ్రఫీ ఫ మనోజ్‌ పిళ్లై, దర్శకుడు టి.కె రాజీవ్‌కుమార్‌.

Post a Comment

Previous Post Next Post