Home » » Keeda Cola Pre Release Event Held Grandly

Keeda Cola Pre Release Event Held Grandly

 'కీడా కోలా' మజా ఇస్తుంది. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది: గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ  ‘పెళ్లి చూపులు’, 'ఈ నగరానికి ఏమైంది' బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రశంసలు అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో చిత్రంగా యూనిక్ క్రైమ్ కామెడీ మూవీ 'కీడా కోలా'తో వస్తున్నారు. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నిర్మిస్తున్నారు. హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలని పెంచాయి. కీడా కోలా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో  చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరైన ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.


ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. నన్ను మీ అందరికీ ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరో  గా పరిచయం చేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. నేను, నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా..వేరే వేరే చోట పెరిగాం. మా నేపధ్యాలు వేరు. మా అందరినీ సినిమా కలిపింది. నాగ్ అశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం లో ఓ పాత్ర చేయించారు. అప్పుడే తరుణ్ తో పరిచయం ఏర్పడింది. తర్వాత పెళ్లి చూపులు చేశాం. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. తరుణ్ కి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. అలాంటి సక్సెస్ తర్వాత ఏమైనా చేయొచ్చు. కానీ తరుణ్ నమ్మింది, నచ్చిన స్క్రిప్ట్, నచ్చిన వాళ్ళతో చేసే దర్శకుడు. ‘పెళ్లి చూపులు’తో  నాకు లాంచ్ ఇచ్చాడు. తర్వాత ఇంకొంత మంది కొత్త వాళ్లతో ఈ నగరానికి ఏమైంది చేసి ఇంకొంతమందికి కెరీర్ ఇచ్చాడు. ఇప్పుడు కీడా కోలాలో కూడా మంచి టాలెంటెడ్ యాక్టర్స్ కనిపిస్తున్నారు. తరుణ్ కి తనపై, తన కథలపై నమ్మకం. ఈ విషయంలో అతన్ని గౌరవిస్తాను. తరుణ్ ఇండస్ట్రీకి దొరికిన అదృష్టం. కీడా కోలా ఖచ్చితంగా మజా ఇస్తుంది. ఎందుకంటే నాకు తరుణ్ భాస్కర్ మీద నమ్మకం. పెళ్లి చూపులు, ఈనగరానికి నచ్చినట్లయితే కీడాకోలా కూడా వందశాతం నచ్చుతుంది. నవంబర్ 3న అందరూ థియేటర్స్ లో చూడండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయండి. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్.  మీకు ఇంకో విషయం చెప్పాలి. తరుణ్ ఓ కథ తీసుకొచ్చాడు. స్క్రిప్ట్ లాక్ చేశాం. తర్వలోనే మా కాంబినేషన్ లో సినిమా వస్తుంది'' అన్నారు.  


హాస్యబ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించడానికి ఏకైక కారణం.. ఇది తరుణ్ భాస్కర్ సినిమా. తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు, ఈనగరానికి చిత్రాలు చూశాను. ఇలాంటి దర్శకులతో పని చేస్తే బాగుంటుందని ఫీలింగ్ కలిగింది. ఇలాంటి తరుణంలో తరుణ్ భాస్కర్ వచ్చి సినిమాలో నటించమని అడిగినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఈ టీంతో పని చేయడం హార్ట్ టచింగ్ గా అనిపించింది. నన్ను ఎంతో గౌరవంగా గొప్పగా చూసుకున్నారు. ఈ టీం అందరితో కలసి నేను ఓ చిన్నపిల్లోడిలా నటించే అవకాశం నాకు కలిగింది. వీళ్ళతో కలసి చేస్తున్నపుడు నాకూ యంగ్ అనే ఫీలింగ్ వచ్చింది. ఇందులో నన్ను వీల్ చెయిర్ లో కూర్చోబెట్టి కామెడీ చేయాలనే కొత్త ఆలోచన తరుణ్ భాస్కర్ కి వచ్చింది. చాలా భాద్యతగా సినిమా తీసే దర్శకుడు తరుణ్. జంధ్యాల గారి సినిమాలు చేస్తున్నపుడు కామెడీ ఎంత హాయిగా పడిందో మళ్ళీ ఈ సినిమాకి అలాంటి అనుభూతి కలిగింది. తరుణ్ స్పష్టమైన లక్ష్యం వున్న దర్శకుడు. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది.'' అన్నారు


తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాల విషయంలో చిన్న భయం వుండేది. థియేటర్ బయటే తిరిగేవాడిని. కీడా కోలా విషయంలో ఆ భయం లేదు. సినిమా చూశాను. సినిమాపై చాలా నమ్మకంగా వున్నాను. క్రైమ్ కామెడీ నా ఫేవరేట్ జోనర్. ఈ సినిమా తీసినందుకు చాలా ఆనందంగా ఫీలౌతున్నాను. నా స్నేహితులు ఉపేంద్ర, కౌశిక్, వివేక్, సాయి కి థాంక్స్. నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమా మా గురించి కాదు ప్రేక్షకుల గురించి డిజైన్ చేశాం. ఎన్ని సమస్యలున్నా నవ్వు కలిగించాలనే ప్రయత్నమే ఈ సినిమా. నవంబర్ అంతా నవ్వుకోవచ్చు. డైరెక్షన్ పరంగా, రైటింగ్ పరంగా మిమ్మల్ని నవ్వించాడానికి చాలా కష్టపడ్డాం. ఈ నగరానికి ఏమైంది సీక్వల్ చేయొచ్చు దానికి మార్కెట్ వుంది. కానీ ఆ ప్రయత్నం చేయలేదు. కొత్తగా  చేయాలనే జీల్ తో కీడా కోలా చేశాం. సౌండ్, యాక్టింగ్.  మ్యూజిక్ పరంగా నవ్వుతారు. కెమెరా పరంగా కూడా నవ్వుతారు. ఇందులో విజువల్ హ్యుమర్ వుంది. అన్నీ రకాల హాస్యం ఇందులో వుంది. ఇందులో బ్రహ్మానందం గారు నటించడం మా అదృష్టం. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు నవ్వుతారు. మీరు నవ్వితే మేము హ్యాపీ. నవంబర్ 3.. మీ ప్రాబ్లమ్స్ మర్చిపోండి, నవ్వుకోండి'' అన్నారు.


రాగ్ మయూర్ మాట్లాడుతూ..  తరుణ్ భాస్కర్ ఈ సినిమాతో నాకు సెకండ్ లైఫ్ ఇచ్చారు.  ప్రతి సినిమాతో ఓ ఇరవై మంది జీవితాల్ని ఆయన మారుస్తారు. ఇది నా మూడో చిత్రం. మా జీవితాలు ఎలా  మారుతాయో నాకు తెలుసు. ఇందులో లంచం అనే మంచి పాత్ర ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది'' అన్నారు


చైతన్య రావు మాట్లాడుతూ.. కీడా కోలా చాలా యునిక్ మూవీ. ఐదేళ్ళ తర్వాత తరుణ్ భాస్కర్ నుంచి ఈ సినిమా వస్తుంది. రెండు గంటల పాటు కడుపుబ్బా నవ్వుతారు. ఈసినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. వివేక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. తరుణ్ తో పని చేయడం నా డ్రీం. ఈ సినిమాతో ఆ కల నెరవేరింది. ఈ సినిమాలో వాస్తు అనే పాత్ర చేశాను. ఆ పాత్ర తప్పకుండా విశేషమైన గుర్తింపు తీసుకొస్తుంది'' అన్నారు.


నిర్మాత సాయికృష్ణ మాట్లాడుతూ.. బేసిగ్గా దర్శకులు హీరోలని లాంచ్ చేస్తారు. కానీ తరుణ్ మాత్రం నిర్మాతలని లాంచ్ చేశారు.  ఈ సినిమా నవంబర్ 3 రిలీజ్ అవుతుంది. ప్రిమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. సినిమా చాలా బావొచ్చింది. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు''అన్నారు,.


నిర్మాత శ్రీపాద్ మాట్లాడుతూ..  ఫ్రెండ్స్ అంతా కలసి చేసిన సినిమా ఇది. ఈ రెండేళ్ళలో సినిమా అంటే ఎంత కష్టమో అర్ధమైయింది. కీడా కోలా .. రెండు గంటల నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్. అన్ని మర్చిపోయి ఎంజాయ్ చేయండి'' అన్నారు


రాజా గౌతమ్ మాట్లాడుతూ.. తరుణ్ నాకు మంచి స్నేహితుడు. కీడా కోలా కథ విన్నప్పుడే చాలా నవ్వొచ్చింది. ఇందులో తాత పాత్రలో ఎవరు చేస్తారని అనుకుంటున్నప్పుడు తరుణ్ నాన్న గారి పేరు చెప్పారు. తరుణ్ వచ్చి కథ చెప్పారు. నాన్నగారికి చాలా నచ్చింది. వెంటనే ఓకే చెప్పారు. కీడా కోలా సినిమాని చాలా ఎంజాయ్ చేశాను. ప్రేక్షకులకు ఇది ఫన్ రైడ్. టీం అందరికీ ఆల్ ది బెస్ట్'  తెలిపారు.  


వివేక్ సాగర్ మాట్లాడుతూ.. తరుణ్ తో వర్క్ చేయడం చాలా ఎక్సైటింగ్ గా వుంటుంది. కీడా కోలా వర్క్ ని చాలా ఎంజాయ్ చేశాం. నేను పని చేసిన ఫేవరేట్ ఫిలిం ఇది. తరుణ్ తో భవిష్యత్ లో మళ్ళీ పని చేయాలని అనుకుంటున్నాను. తప్పకుండా మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది'' అన్నారు. ఈ వేడుకలో రఘురాం, ఆశిష్ తేజ్, పూజిత, ఆరోన్ తదితరులు పాల్గొన్నారు.Share this article :