Home » » Doctorate For Actress Saraswati Pradeep

Doctorate For Actress Saraswati Pradeep

 ప్రముఖ వ్యాఖ్యాత, నటి సరస్వతీప్రదీప్ కి డాక్టరేట్



ప్రముఖ సినీ, టివి నటుడు ప్రదీప్ భార్య సరస్వతీ ప్రదీప్ అరుదైన ఘనత సాధించారు. తెలుగులో తొలితరం వ్యాఖ్యాత, నటి శ్రీమతి సరస్వతీప్రదీప్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా PhD పట్టా పొందారు. “ తెలుగు సీరియళ్ళు – వస్తు పరిశీలన” అనే అంశం మీద ప్రొఫెసర్ వారిజా రాణి పర్యవేక్షణలో సరస్వతీప్రదీప్ పరిశోధన చేశారు. మన లాక్షణికులు అందించిన  కథా లక్షణాలు, నవలా లక్షణాలు, నాటక లక్షణాలను ప్రాతిపదికగా తీసుకుని తెలుగు సాహిత్య రంగంలో ఎందరో  రచయితలు విశేషమైన రచనలు చేస్తున్నారు. అయితే రచన రూపంలోని కథ సీరియల్ కథగా దృశ్యరూపంలోకి మారినపుడు, జరిగే మార్పుల వలన కొత్త లక్షణాలను సంతరించుకుంటుంది.  33 సంవత్సరాలుగా  తనకు తెలుగు టివి రంగంతో వ్యాఖ్యాతగా, నటిగా, నిర్మాత, దర్శకురాలిగా ఉన్న అనుభవంతో, తొలిసారిగా ఈ గ్రంధంలో సీరియల్ కథకు వుండే లక్షణాలను విశ్లేషించారు సరస్వతీప్రదీప్. విశేషమేమిటంటే, ఆమె తండ్రి అనంతకృష్ణ చదువుకు లేదు వయసు అని పదవీ విరమణ తరవాత సంస్కృతంలో PhD పట్టా పొందారు. వారిని స్ఫూర్తిగా తీసుకున్నాను అనే సరస్వతి  పరిశోధన, తన మనవరాలి అక్షరాభ్యాసం ఒకే కాలంలో జరగడం మరొక విశేషం. అంతేగా, అంతేగా.. అంటూ ఒక్క డైలాగ్‌తో ఎఫ్‌2, ఎఫ్‌ 3లలో అలరించిన నటుడు ప్రదీప్‌ గతంలో హీరోగా అనేక సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.


Share this article :