Benaka Gold Company Launched by Actress Jayasudha

 బెనకా గోల్డ్‌ కంపెనీని ప్రారంభించిన సహజనటి జయసుధ.




మేము వడ్డీ చెల్లించి మీ బంగారాన్ని విడిపిస్తాం, ఈ రోజు ఉన్న మార్కెట్‌ రేటుతో  మీ బంగారంతోపాటు రాళ్ల విలువను కూడా పరిగణనలోకి తీసుకుంటాం అని  బెనకా యాడ్‌లో అంటున్నారు  సహజనటి జయసుధ. ఆమె నటించిన బంగారం కంపెనీ యాడ్‌ హెడ్‌ఆఫీస్‌ హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో జయసుధ చేతులమీదుగా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ–‘‘ బెంగుళూరులో తమ సేవలతో ఎంతో మంచి పేరు తెచ్చుకుంది బెనకా గోల్డ్‌ కంపెనీ. అందుకే ఆ సంస్థ యాడ్‌ డైరెక్టర్‌ దీపక్‌ ఆవుల మేడమ్‌ మనం యాడ్‌ చేద్దాం అనగానే వెంటనే ఓకే అనేశాను. ఆ కంపెనీ యం.డి భరత్‌ కుమార్‌ తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని బ్రాంచీలు ప్రారంభించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. బెనకా గోల్డ్‌ సంస్థ యండి యస్‌ భరత్‌కుమార్‌ మాట్లాడుతూ–‘‘ తెలుగు రాష్ట్రాల్లో మేము 20 బ్రాంచిలను ప్రారంభిస్తాం’’ అన్నారు. యాడ్‌ డైరెక్టర్‌ దీపక్‌ ఆవుల మాట్లాడుతూ–‘‘ జయసుధ గారి వంటి గొప్ప నటితో కలిసి పనిచేయటం ఎంతో గౌరవాన్ని, ఆనందాన్ని ఇచ్చింది అన్నారు.

Post a Comment

Previous Post Next Post