Vyooham Song Out Now

 జగనుడి బాణం– రాక్షసుల సంహారం అంటున్న ఆర్జీవి...

వైయస్‌. రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా తొలిపాట విడుదల...



‘‘పులుల వేషంలో గుంటనక్కలు, నిక్కబొడిచి ఆడుతున్న రాజకీయ వ్యూహం’’ అనే లైన్లతో ప్రారంభమయ్యే ‘వ్యూహం’ సినిమాలోని తొలిపాటను ఈ రోజు విడుదల చేశారు ఆర్జీవి అండ్‌ టీమ్‌. ఆర్జీవి డెన్‌ స్టూడియోస్‌తో కలసి దమ్మున్న నిర్మాత రామదూత క్రియేషన్స్‌ అధినేత దాసరి కిరణ్‌ కుమార్‌ ‘ వ్యూహం ’ సినిమా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 2వతేది స్వర్గీయ వై.యస్‌ రాజశేఖర్‌ రెడ్డి భౌతికంగా భువిని విడిచి వెళ్లిన రోజని తెలుగు ప్రజలందరికి తెలుసు. ఆ రోజున ప్రపంచం అంతా దిగ్భ్రాంతికి గురైంది. శత్రువులు కూడా అయ్యే పాపం అని విలవిలలాడిన రోజది. ఆ రోజునుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన రాజకీయ చదరంగ మారణ హోమాన్ని తనదైన స్టైల్లో ‘ వ్యూహం ’ అనే టైటిల్‌తో సెన్సేషనల్‌ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పెద్దాయన రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని  ‘వ్యూహం’ సినిమాలోని మొదటిపాటను విడుదల చేశారు. ఈ పాటకు సంగీతాన్ని అందించి పాడింది కీర్తన శేష్‌. ఈ పాటకు లిరిసిస్ట్‌ రాజశేఖర్‌. ‘వ్యూహం’ సినిమా దాదాపు 80శాతం షూటింగ్‌ పూర్తయింది. ఇప్పటికే ఆర్జీవి విడుదల చేసిన రెండు టీజర్‌లకు విపరీతమైన స్పందన వచ్చి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఈ చిత్రంలో వై.యస్‌ జగన్‌గా అజ్మల్‌  వైయస్‌.భారతీ పాత్రలో మానస నటిస్తున్నారు. ఈ చిత్రానికి డి.ఓ.పి – సుజీష్‌ రాజేంద్రన్, ఎడిటర్‌– మనీష్‌ ఠాకూర్,  పిఆర్వో– శివమల్లాల

Post a Comment

Previous Post Next Post