Home » » Vareva Jathagallu Movie Release date

Vareva Jathagallu Movie Release date

 వారెవ్వా జతగాళ్ళు  సినిమా సెప్టెంబర్ 22న విడుదల




సాయి పవన్, ప్రియాంక హీరో హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ చిత్రం "వారెవ్వా జతగాళ్ళు". పోసాని కృష్ణమురళి, జబర్దస్త్ గుండు మురళి, భాస్కర్, కన్నడ, ఫిలిం యాక్టర్ రాబర్ట్ లూయిస్, మమత వంటి మంచి కాస్టింగ్ తో బండారు నాగబాబు (రాజు), దొడ్డి వీర ప్రభాకర్ మరియు గరగ వీరబాబు నిర్మాతలుగా సత్య సలాది దర్శకత్వం వహించిన చిత్రం "వారెవ్వా జతగాళ్ళు". ఈ చిత్రం సెప్టెంబర్ 22న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా విడుదల అవుతుంది. అనంతరం ఈ చిత్రాన్ని మరో ఐదు భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.


ఈ సందర్భంగా దర్శకుడు సత్య సలాది మాట్లాడుతూ "తమిళనాడులో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి ఈ కథను తయారు చేయడం జరిగింది.  ఆటలు, పాటలు, విద్య పాఠశాలలు, ప్రాథమిక హక్కులు సైతం నిషేధించిన ఒక నిరంకుశత్వ  గ్రామంలో ఒక నలుగురు కుర్రాళ్లు చేసిన పోరాటమే ఈ చిత్ర కథ. మంచి సస్పెన్స్, థ్రిల్లర్, లవ్, కామెడీ, ఎమోషనల్, సెంటిమెంట్ తో అన్ని వర్గాలను అలరిస్తుంది. సెప్టెంబర్ 22న విడుదల అవుతుంది" అని తెలిపారు.



చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ "డి. రామానాయుడు స్టూడియోలో మా చిత్ర ప్రివ్యూ సో మీ చూసిన ప్రముఖులు రెగ్యులర్ కథలా కాకుండా విభిన్నంగా ఉందని సినిమాలో ప్రతి సీన్ ని చాలా జాగ్రత్తగా సరికొత్తగా తీర్చిదిద్దడంలో డైరెక్టర్ సత్య సలాది విజయాన్ని సాధిస్తుంది. సినిమా చాలా గొప్పగా వచ్చింది అని కొనియాడారు. సెప్టెంబర్ 22న తెలుగు లో విడుదల చేస్తున్నాం మరియు ఇతర భాషల్లో త్వరలో విడుదల చేస్తాం" అని తెలిపారు.  



చిత్రం పేరు : వారెవ్వా జతగాళ్ళు


నటి నటులు : సాయి పవన్, ప్రియాంక, పోసాని కృష్ణమురళి, జబర్దస్త్ గుండు మురళి, భాస్కర్, కన్నడ, ఫిలిం యాక్టర్ రాబర్ట్ లూయిస్, మమత, తదితరులు


మ్యూజిక్ కంపెనీ : ఓ ఎస్ డి (OSD) మ్యూజిక్


ఆడియో గ్రాపర్ : కాళీ ఎస్ ఆర్ అశోక్


రథ్యం : షరాన్ సంతోష్


కీ బోర్డు : సంతోష్ ఏం


కొరియోగ్రాఫేర్ : సంజు, రాజు


లిరిక్స్ : శ్రీ కృష్ణ బుద్ధిగ


సింగెర్స్ : వరం, శ్రీ కృష్ణ


ఎడిటర్ : చిట్టి కన్నా


కెమెరా మాన్ : సాయి సాగర్ నేత


సంగీతం : సంతోష్ ఎమ్


నిర్మాతలు : బండారు నాగబాబు (రాజు), దొడ్డి వీర ప్రభాకర్, గరగ వీరబాబు


స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే,  డైరెక్టర్ : సత్య సలాది 



Share this article :