Tanish Criminal First Look Launched

 తనీష్ బర్త్ డే స్పెషల్: క్రిమినల్ పోస్టర్ రిలీజ్ 



చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రత్యేకతను చాటుకుని తర్వాత హీరోగా టర్న్ అయ్యి.. నచ్చావులే సినిమాతో టాలెంట్ ని ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత విలన్ కేరెక్టర్స్ కూడా చేసిన తనీష్ కొద్దిరోజులుగా నటనకు దూరంగా ఉంటున్నాడు. మధ్యలో బిగ్ బాస్ సీజన్ 2 లో టాప్ 5 కంటెస్టెంట్ గా ప్రేక్షకులకి మరికాస్త దగ్గరైన హీరో తనీష్ ఇప్పుడు సరికొత్తగా రాబోతున్నాడు. 

రేపు గురువారం సెప్టెంబర్ 7న తనీష్ బర్త్ డే సందర్భంగా ఆయన  కిశోర్ వర్మ దర్శకత్వం లో చేస్తున్న క్రిమినల్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసారు. క్రియేటివ్ ఫ్రెండ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై తనీష్ హీరోగా, కిశోర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రిమినల్ పోస్టర్   యొక్క ఫస్ట్ లుక్ ని మేకర్స్ ఇంతకుముందే రిలీజ్ చేసారు. 

క్రిమినల్ పోస్టర్ లో తనీష్ కొత్తగా కనిపించాడు. ఒక్క పోస్టర్ లోనే రెండు వేరియేషన్స్ తో తనీష్ లుక్ డిఫ్రెంట్ గా కనిపిస్తుంది. ఇంకా ఈ దీనికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే విడుదల చేస్తామని యూనిట్ తెలిపింది.

Post a Comment

Previous Post Next Post