Grand Felicitation for Prominent Lyric writer Chandrabose

 ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్‌ కి ఘనంగా సన్మానం



జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్‌ ని ఘనంగా సత్కరించాలని ప్రముఖ సినీ నటుడు శ్రీ ప్రదీప్ గారి ఆధ్వర్యంలో I FLY STATION నిర్ణయించింది. ఈ నెల ౩౦ న  సాయంత్రం 5:30 ని.లకు హైదరాబాద్‌లోని  శిల్పకళావేదిక లో కార్యక్రమం జరగనుంది.  చంద్రబోస్ రచించిన గీతాల గురించి  వారే స్వయంగా  తమ మనసులోని మాటలను తెలియజేస్తూ , ఆ పాటను ప్రముఖ గాయనీ గాయకులు గీతామాధురి దీపు పి విఎన్ఎస్ రోహిత్, సత్య యామిని, అతిథి భావరాజు, సాయి చరణ్ లతో పాడించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు హాజరు కానున్నారు వారిలో మురళీ మోహన్ , హీరో శ్రీకాంత్, సంగీత దర్శకురాలు శ్రీలేఖ, రచయిత రామ జోగయ్య శాస్త్రి, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్ పాల్గొంటారు.

Post a Comment

Previous Post Next Post