Home » » Chala Bagunde Song Launched From Thiragabadarasami

Chala Bagunde Song Launched From Thiragabadarasami

రాజ్ తరుణ్, ఎ ఎస్ రవికుమార్ చౌదరి, సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ 'తిరగబడరసామీ' నుంచి చాలా బాగుందే పాట విడుదల  



యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'తిరగబడరసామీ'. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇదివరకే  విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ , టీజర్ పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశాయి.  


ఇప్పుడు తిరగబడరసామీ మ్యూజికల్ జర్నీ మొదలైయింది. ఈ చిత్రంలోని 'చాల బాగుందే' పాటని విడుదల చేశారు మేకర్స్. మనసుని హత్తుకునే హార్ట్ ఫుల్ లైవ్లీ మెలోడీగా ఈ పాటని కంపోజ్ చేశారు జెబి.


చైతు సత్సంగి, లిప్సిక ఈ పాటని మ్యాజికల్ గా పాడారు. శ్రీమణి అందించిన సాహిత్యం మరో ఆకర్షణగా నిలిచింది. ఈ పాటలో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ బ్యూటీఫుల్ అండ్ లవ్లీగా వుంది.  


ఈ చిత్రానికి జవహర్ రెడ్డి కెమరామెన్ గా పని చేస్తున్నారు. బస్వా పైడిరెడ్డి ఎడిటర్, రవికుమార్ గుర్రం ఆర్ట్ డైరెక్టర్. భాష్యశ్రీ డైలాగ్స్ అందిస్తున్నారు.


తారాగణం: రాజ్ తరుణ్ , మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి


సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం: ఎ ఎస్ రవికుమార్ చౌదరి

నిర్మాత: మల్కాపురం శివకుమార్

బ్యానర్: సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా

సంగీతం: జెబి

డీవోపీ: జవహర్ రెడ్డి యం. ఎన్

ఎడిటర్: బస్వా పైడిరెడ్డి

ఆర్ట్:  రవికుమార్ గుర్రం

 ఫైట్స్ - పృద్వీ, కార్తీక్

మాటలు: భాష్యశ్రీ

పీఆర్వో: వంశీ శేఖర్



Share this article :