నవంబర్ 10న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘అన్వేషి’
విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘అన్వేషి’. అరుణ శ్రీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వి.జె.ఖన్నా దర్శకత్వంలో టి.గణపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 10న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ సందర్బంగా...
నిర్మాత టి.గణపతి రెడ్డి మాట్లాడుతూ ‘‘నిర్మాతగా అన్వేషి నా తొలి చిత్రం. మా డైరెక్టర్ వి.జె.ఖన్నా మంచి కథ, స్క్రీన్‌ప్లేతో మంచి సినిమా చేశారు. షూటింగ్ అంతా పూర్తయ్యింది. నవంబర్ 10న గ్రాండ్ రిలీజ్‌కి ప్లాన్ చేశాం. హీరో విజయ్, హీరోయిన్ సిమ్రాన్ అద్భుతంగా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నాం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని వివరాలను తెలియజేస్తాం. చైతన్ భరద్వాజ్ సంగీతం, కె.కె.రావు సినిమాటోగ్రఫీ విజువల్స్ ఆకట్టుకుంటాయి’’ అన్నారు.
దర్శకుడు వి.జె.ఖన్నా మాట్లాడుతూ ‘‘మా అన్వేషి సినిమా కథపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన నిర్మాత గణపతి రెడ్డిగారికి థాంక్స్. అలాగే సహ నిర్మాతలు అందరూ నాకెంతో సపోర్ట్‌గా నిలిచారు. హీరో విజయ్ ధరణ్, సిమ్రాన్ గుప్తాలు చక్కగా నటించారు. అనన్య నాగళ్ల ఈ సినిమాలో కీ పాత్రలో నటించారు. ఆమె చుట్టూనే కథ తిరుగుతుంటుంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో నడిచే సినిమా. చైతన్ భరద్వాజ్ ఎంత ఎఫర్ట్ పెట్టారో నాకు తెలుసు. నవంబర్ 10న మీ ముందుకు వస్తున్నాం’’ అన్నారు.
నటీనటులు:
విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల, అజయ్ ఘోష్, నాగి, ప్రభు దిల్ రమేష్, చంద్ర శేఖర్ రెడ్డి, రచ్చ రవి, మిమిక్రీ సుబ్బరావు, ఇమ్మాన్యుయేల్, జబర్దస్త్ సత్య తదితరులు
టెక్నీషియన్స్:
బ్యానర్: అరుణ శ్రీ ఎంటర్‌టైన్మెంట్స్
నిర్మాత: టి.గణపతి రెడ్డి
కో ప్రొడ్యూసర్స్: హరీష్ రాజు, శివన్ కుమార్ కందుల, గొల్ల వెంకట రాంబాబు, జాన్ బోయలపల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దుర్గేష్.ఎ
రచన, దర్శకత్వం: వి.జె.ఖన్నా
సినిమాటోగ్రఫీ: కె.కె.రావు
మ్యూజిక్: చైతన్ భరద్వాజ్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఆర్ట్: గాంధీ నడికుడికర్
లిరిక్స్: చైతన్య ప్రసాద్, చైతన్య వర్మ, శుభం విశ్వనాథ్
స్టంట్స్: జాషువా
కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, విద్యాసాగర్ రాజు
పి.ఆర్.ఒ: వంశీ కాకా
Post a Comment