83/TFCC/2023-25/ 04-8-2023
పత్రికా ప్రకటన
"సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023" ను, 31-07-2023 తేదీన పార్లమెంట్ లో ఆమోదించినందులకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరపున భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ, కేంద్ర సమాచార శాఖ మాత్యులు శ్రీ అనురాగ్ ఠాకూర్, Dr. L.O. మురుగన్, కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి వర్యులు గారికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేయుచున్నాము.
ఇది నిర్మాతలకు గణనీయంగా సహాయం చేస్తుంది మరియు వారి చిత్రాలను కాపాడుకోవడానికి మరియు వారి ఆశించిన ఆదాయాలను అందుకోవడానికి వారికి అవకాశం వుండగలదు.
ఈ విషయంలో మాకు సహకరించిన శ్రీ అపూర్వ చంద్ర, కార్యదర్శి, కేంద్ర సమాచారశాఖ, శ్రీ రవీంద్ర భాకర్, సీఈఓ, సెంట్రల్ బోర్డు అఫ్ ఫిలిం సర్టిఫికేషన్ మరియు శ్రీమతి షిఫాలీ కుమార్, రీజినల్ ఆఫీసర్, సెంట్రల్ బోర్డు అఫ్ ఫిలిం సర్టిఫికేషన్, హైదరాబాద్ వారికి కృతజ్ఞతలు తెలియచేయుచున్నాము.
(వి. వెంకటరమణా రెడ్డి) (కె. ఎల్ దామోదర్ ప్రసాద్)
అధ్యక్షులు గౌరవ కార్యదర్శి