Priyanka Arul Mohan Shooting Part Completed in Captain Miller

ధనుష్, అరుణ్ మాథేశ్వరన్, టి.జి. త్యాగరాజన్, సత్యజ్యోతి ఫిల్మ్స్ 'కెప్టెన్ మిల్లర్' లో ప్రియాంకా అరుళ్‌ మోహన్ పోర్షన్ షూటింగ్ పూర్తి



నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్  హై-బడ్జెట్ పీరియడ్ ఫిల్మ్ 'కెప్టెన్ మిల్లర్'. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. 2023లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పీరియాడికల్ ఫిల్మ్ 1930-40ల నేపథ్యంలో తెరకెక్కుతోంది. ధనుష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్ నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యింది.


ఈ  పీరియడ్ ఫిల్మ్ లో ప్రియాంకా అరుళ్‌ మోహన్ కథానాయిగా నటిస్తోంది. తాజాగా ఆమె పోర్షన్ కి సంబధించిన షూటింగ్ పూర్తి చేశారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన వర్కింగ్ పోస్టర్ లో దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ కు పాయింట్ బ్లాంక్ లో గన్ గురి పెటినట్లు కనిపించింది.  


ఈ చిత్రాన్ని టి.జి. త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిల్మ్స్, సెంధిల్ త్యాగరాజన్ ,అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌ సహా నిర్మాతలు.  


జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి, సిద్ధార్థ నుని డీవోపీ గా పని చేస్తున్నారు.  


బాహుబలి ఫ్రాంచైజీ, RRR, పుష్ప వంటి చిత్రాలకు పనిచేసిన మధన్ కార్కీ ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ రాశారు. నాగూరన్ ఎడిటర్.


‘కెప్టెన్ మిల్లర్’ డిసెంబర్ 15, 2023న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.


తారాగణం: ధనుష్, ప్రియాంక మోహన్, సందీప్ కిషన్, డాక్టర్ శివ రాజ్ కుమార్


సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్

నిర్మాతలు: జి. శరవణన్, సాయి సిద్ధార్థ్

సమర్పణ: T.G. త్యాగరాజన్

బ్యానర్: సత్యజ్యోతి ఫిల్మ్స్

సంగీతం: జివి ప్రకాష్ కుమార్

డీవోపీ: సిద్ధార్థ నుని

ఎడిటింగ్: నాగూరన్

ఆర్ట్: టి.రామలింగం

పీఆర్వో: వంశీ-శేఖర్


Post a Comment

Previous Post Next Post