Home » » Madhi lo Madhi First Look Launched

Madhi lo Madhi First Look Launched

 బేబి దర్శకుడు సాయి రాజేష్ చేతుల మీదుగా 'మదిలో మది' సినిమా రిలీజ్ డేట్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల



ప్రేమ కథా చిత్రాలకు జనాల నుంచి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. రీసెంట్‌గా బేబి సినిమానే దానికి నిదర్శనం. యువతను ఆకట్టుకునే కథ, కథనాలతో సాయి రాజేష్ తీసిన బేబి సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలాంటి కోవలోకి చెందే మరో బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా మదిలో మది అనే చిత్రం రాబోతోంది. జై, శీను, స్వీటీ, సిరి రావుల చారి, సునీతలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ప్రకాష్ పల్ల దర్శకత్వం వహించారు. ఎస్ కే ఎల్ ఎమ్ క్రియేషన్స్ మీద నేముకూరి జయకుమార్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బేబి మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ విడుదల చేశారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ..  ‘మదిలో మది సినిమా ఆగస్ట్ 18న విడుదల కాబోతోంది. నేను ట్రైలర్‌ను చూశాను అద్భుతంగా ఉంది. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ ’ అని అన్నారు.


ఆ మధ్య  ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్‌ విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే బలగం మూవీ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ చేతుల మీదుగా లాంచ్ అయిన టైటిల్ టీజర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాకు షారుఖ్‌ సంగీతం, క్రాంతి నీల, రాజేష్‌ మధుమాల సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.


నటీనటులు : జై, శీను, స్వీటీ, సిరి రావుల చారి, సునీత


సాంకేతికబృందం

బ్యానర్ : ఎస్ కే ఎల్ ఎమ్ క్రియేషన్స్

నిర్మాత :  నేముకూరి జయకుమార్

కథ, కథనం, మాటలు, దర్శత్వం  : ప్రకాష్ పల్ల

మ్యూజిక్  : షారుఖ్‌

సినిమాటోగ్రఫీ  : క్రాంతి నీల, రాజేష్‌ మధుమాల

ఎడిటింగ్  : నరేష్‌ దొరపల్లి 

పీఆర్వో  : సాయి సతీష్‌


Share this article :