Atta Ettaga Lyrical From Sagiletikatha Launched

మ్యూజిక్ డైరెక్టర్ ‘రధన్’ చేతుల మీదగా సగిలేటి కథ మూవీలో 'అట్టా ఎట్టాగా' రెండొవ లిరికల్‌ సాంగ్‌ డిజిటల్ లాంచ్... 



రవి మహాదాస్యం(Ravi Mahadasyam), విషిక లక్ష్మణ్‌(Vishika Laxman) జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ(Sagiletikatha)’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వం వహించారు. హీరో నవదీప్‌ సి-స్పేస్ సమర్పణలో, షేడ్‌ ఎంటర్టైన్మెంట్‌, అశోక్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయ్యిన ట్రైలర్ ప్రేక్షకుల నుండి అశేష ఆధరణ పొందడంతోపాటు, విడుదలైన సాంగ్స్ కి కుడా మంచి అప్లాజ్స్ రావడం విశేషం. 


ఈ సినిమాలోని ‘అట్టా ఎట్టాగా' రెండొవ లిరికల్‌ సాంగ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ ‘రధన్’ డిజిటల్ లాంచ్ చెయ్యగా, చిత్ర యూనిట్ కి విషెష్ తెలియజేసారు.  


అట్టా ఎట్టాగా పుట్టేసినావు 

నన్నే ఇట్టాగా సంపేస్తున్నావు

సలికాలం సెగరేపే సలిమంటల్లాగా 

నాలోన మంటేట్టినావే 

ఇసుకల్లో నడిచొచ్చే ఓంటే పిల్లలాగా 

నీదారే నాదంటూ దాహం తీర్చావే..!! అంటూ చక్కటి మెలోడీ అందించిన ఈ గీతాన్ని రాజశేఖర్ సుద్మూన్, జశ్వంత్ పసుపులేటి రాశారు. యశ్వంత్ నాగ్(పరేషాన్ మూవీ ఫెమ్), కమల మనోహరి ఆలపించారు. ఈ చిత్రానికి జశ్వంత్ పసుపులేటి సంగీత దర్శకుడు.


సగిలేటి కథ సినిమాలో ప్రతి సాంగ్ ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా 'అట్టా ఎట్టాగా' సాంగ్ లో ఒక అబ్బాయి, ఒక అమ్మాయిని మొదటి చూపులోనే ప్రేమలో పడే సన్నివేశంలో ఈ సాంగ్ మొదలవ్వుతుంది. ఈ సాంగ్ యూత్ ని బాగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ తెలుపుతున్నారు.


అలాగే, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు సెరవేగంగా కొనసాగుతుండగా, త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.


నటీనటులు: రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్, నరసింహా ప్రసాద్ పంతగాని

రచన, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్: రాజశేఖర్ సుడ్మూన్

కో-రైటర్: శశికాంత్ బిల్లపాటి, మని ప్రసాద్ అరకుల

నిర్మాతలు: అశోక్ మిట్టపల్లి, దేవీప్రసాద్ బలివాడ

ఇన్ అసోసియేషన్ విత్: సి స్పెస్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరేష్ మాదినేని

అసోసియేట్ ప్రొడ్యూసర్: పుష్పాభాస్కర్, సునీల్ కుమార్ ఆనందన్, లీలా కృష్ణ కొండేపాటి

లైన్ ప్రొడ్యూసర్: చందు కొత్తగుండ్ల

సంగీతం: జశ్వంత్ పసుపులేటి

నేపథ్యసంగీతం: సనల్ వాసుదేవ్

సింగర్స్: కీర్తన శేష్, కనకవ్వ

సాహిత్యం: వరికుప్పల యాదగిరి, పవన్ కుందాని, రాజశేఖర్ సుడ్మూన్, శశికాంత్ బిల్లపాటి, జశ్వంత్ పసుపులేటి

పి.ఆర్.ఓ: తిరుమలశెట్టి వెంకటేష్

ఆర్ట్ డైరెక్టర్స్: హేమంత్ జి, ఐశ్వర్య కులకర్ణి

కాస్ట్యూమ్ డిజైనర్: హర్షాంజలి శేనికేషి

సౌండ్ డిజైనర్: యతి రాజు

సౌండ్ మిక్సింగ్: శ్యామల సిక్దర్

డి.ఐ: కొందూరు దీపక్ రాజు

పబ్లిసిటీ డిజైనర్: యమ్.కే.యస్ మనోజ్



Post a Comment

Previous Post Next Post