దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్, 7 స్క్రీన్ స్టూడియో 'లియో' షూటింగ్ పూర్తి
దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ ల క్రేజీ ప్రాజెక్ట్ 'లియో' కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ రోజుతో 'లియో' షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలిసి దిగిన స్టిల్స్ ని విడుదల చేశారు మేకర్స్.
7 స్క్రీన్ స్టూడియోపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా, జగదీష్ పళనిసామి సహనిర్మాత గా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణం కనిపించనుంది. విజయ్ సరసన త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీఖాన్, మాథ్యూ థామస్, శాండీ మాస్టర్ తదితరులు ఇతర ప్రముఖ తారాగణం.
రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్, ఎన్. సతీస్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్. రామ్‌కుమార్ బాలసుబ్రమణియన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
అక్టోబర్ 19న లియో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
తారాగణం: విజయ్, త్రిష కృష్ణన్, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ థామస్, శాండీ మాస్టర్
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
నిర్మాత: ఎస్ ఎస్ లలిత్ కుమార్
బ్యానర్: 7 స్క్రీన్ స్టూడియో
సహ నిర్మాత: జగదీష్ పళనిసామి
సంగీతం: అనిరుధ్ రవిచందర్
డీవోపీ: మనోజ్ పరమహంస
యాక్షన్: అన్బరివ్
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్
ఆర్ట్: ఎన్. సతీస్ కుమార్
కొరియోగ్రఫీ: దినేష్
డైలాగ్ రైటర్స్: లోకేష్ కనగరాజ్, రత్న కుమార్ & దీరజ్ వైద్య
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామ్‌కుమార్ బాలసుబ్రమణియన్.
పీఆర్వో: వంశీ-శేఖర్